ఇన్స్టంట్ మెసెంజర్ వాట్సాప్‌లో ఇటీవలే స్టికర్ ఫీచర్ వచ్చింది. కొద్ది సమయంలోనే దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. అయితే కొన్ని స్టికర్లు డీఫాల్ట్‌గా ఉన్నప్పటికీ మనకు నచ్చిన స్టిక్కర్లను కూడా క్రియేట్ చేసే వీలుంది. అదెలాగో చూడండి.
- మీ మొబైల్ లో ఉన్నగూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి Sticker maker for WhatsApp అనే యాప్ ను డౌన్లోడ్ చేసి రన్ చేయండి.
- Create a new sticker pack అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
- స్టిక్కర్ ప్యాక్ పేరు, రచయితను నమోదు చేయండి. ఇది కేవలం వివరణాత్మక ప్రయోజనాల కోసం, మీ అనుకూలీకరించిన స్టికర్లు ఇతర WhatsApp వినియోగదారులకు అందుబాటులో ఉండవు.
- న్యూ లిస్ట్ ఆప్షన్ ను క్లిక్ చేయండి ఖాళీ స్టిక్కర్లు ట్రేతో పేజీ తెరవబడుతుంది.
- మొదట, స్టిక్కర్లు ప్యాక్ యొక్క చిహ్నాన్ని జోడించి, ఆపై కొత్త కస్టమైజ్డ్ స్టిక్కర్‌ను జోడించడానికి తదుపరి ట్రేలో నొక్కండి.
- ఒక కొత్త స్టిక్కర్ జోడించడానికి ఖాళీ ట్రే నొక్కండి అప్పుడు మీరు ఒ కొత్త ఫోటో తీసుకోవచ్చు లేదా గ్యాలరీ నుండి ఇంపోర్ట్ చేసుకోవచ్చు
- మీరు ఫోటో ను సెలక్ట్ చేసాక అది ఇమేజ్ ఎడిటర్ లో అప్ లోడ్ అవుతుంది.
- ఒక కొత్త స్టిక్కర్ కోసం ఆ ఇమేజ్ నుండి మీకు కావాల్సిన విధంగా క్రాప్ చేయండి.
- ఇప్పుడు, ప్యాక్ కి మరింత అనుకూల స్టిక్కర్లను జోడించడానికి ఫోటోను సేవ్ చేసి ఈ స్టెప్స్ ను రిపీట్ చేయండి.
- ప్యాక్‌కు స్టిక్కర్లను జోడించడం పూర్తయిన తర్వాత Publish Sticker Pack ఆప్షన్ ను క్లిక్ చేయండి.
- మీరు మీ WhatsApp యాప్ కు ఈ స్టిక్కర్లను జోడించమని అడగబడతారు,వెంటనే మీరు యాక్సప్ట్ చేసి మీ కస్టమైజ్డ్ స్టిక్కర్స్ ను అందరితో షేర్ చేసుకోండి.
Authorization