చాలామంది మొబైల్స్ వాడుతున్నప్పటికీ అందులో ఉన్న ఫీచర్స్ తెలుసుకోలేరు. ఫోన్లో ఉండే ప్రతి ఫీచర్ గురించి తెలుసుకోవడం కాస్త కష్టమే. ఏది ఓకే చేస్తే ఏమౌతుందో అనే భయం కొందరిలో ఉంటుంది. అయితే కొన్ని ఫీచర్స్ మాత్రం మన రోజువారి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని ఫీచర్ల గురించే ఈ వారం టెక్ప్లెస్లో మీకు పరిచయం చేస్తునాం...
కలర్ నోట్
మొబైల్స్ వాడే వారికి చాలావరకు మెమో, నోట్ లలోని స్పేస్ సరిపోతుంది. కానీ మరికొంతమందికి వేరే పేజ్ లోకి వెళ్ళకుండానే అదే పేజీలో మేటర్‌ను కథలాగా కంటిన్యూ చేయాలని అనుకుంటారు. అటువంటి వారికోసం మరో అద్భుతమైన ఆప్షన్ 'కలర్ నోట్'. ఈ యాప్ లో కథలు, కవితలు... ఏదైనా... ఎంతైనా రాయొచ్చు. సేవ్ చేసుకోవచ్చు. టైప్ చేయడం కష్టం అయిపోయేవారు కలర్ నోట్ ను ఎంపిక చేసుకోవడం మంచి ఆలోచన. ఈ యాప్ లో మన ఆలోచనలను నేరుగా వాయిస్ రూపంలో చెబుతూ ఉంటే అది text రూపంలోకి మార్చుకుంటుంది. నచ్చిన రంగులను ఎంపిక చేసుకునే సౌలభ్యం కూడా ఈ యాప్ లో ఉంది.
ఉదాహరణకు ఒక జోనర్ కు సంబంధించిన మ్యాటర్ ను ఒకే రంగులో కనిపించేలా పెట్టుకోవచ్చు. మరో జోనర్ కు సంబంధించిన మ్యాటర్ కు మరో కలర్ సెట్ చేసి పెట్టుకుంటే చదువుకునేప్పుడు చాలా తేలిక అవుతుంది.
మళ్లీ మళ్లీ గుర్తు చేసుకునేలా ఏదైనా మ్యాటర్ రాసి మొబైల్ లో పెట్టుకుంటే బాగుండు అని చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. మన రోజువారీ దినచర్యలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని మరుసటి రోజుకి మర్చిపోతుంటాం. అంతేకాదు ఒక్కొక్కసారి మనం చేయాల్సిన పనులను గుర్తుపెట్టుకునే బాధ లేకుండా ఒక జాబితా తయారుచేసుకోవాలి అనుకుంటాం. కానీ వాటన్నింటినీ గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంటుంది. చాలాసార్లు మరచిపోతుంటాం కూడా. కానీ ఇప్పుడు వస్తున్న అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఈ ఫీచర్ కచ్చితంగా ఉంటుంది. అవసరం అయినప్పుడు ఆ మ్యాటర్ ను మళ్లీ మళ్లీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మొబైల్స్, యాప్స్‌లో ఇంగ్లీష్‌తో పాటు మనకు నచ్చిన ఇతర భాషను కూడా రాసుకునే సౌలభ్యం వుంది.
- ఫిర్దౌస్
వన్ నోట్
మైక్రోసాఫ్ట్ సంస్థ రూపొందించిన ఆప్స్ లో ఇది ఒకటి. ఇది ఆల్మోస్ట్ ఒక నోట్ బుక్ లో ఎలా రాసుకో గలమో 'వన్ నోట్' అనే ఫీచర్ లో కూడా అలాగే రాసుకోవచ్చు. ఈ నోట్ లో ప్రైవసీ మెయింటెన్ చేసుకోవచ్చు. పాస్ వర్డ్ ఉపయోగించి మొబైల్ ఎవరి చేతికి వెళ్లినా ఈ నోట్ ఓపెన్ చేయకుండా వ్యక్తిగత విషయాలను డైరీ గా రాసుకునేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాదాపు ఈ ఫీచర్ కూడా మొబైల్ తో పాటే ఇన్స్టాల్ అయి వస్తుంది.
మెమో...
ఆండ్రాయిడ్ మొబైల్స్ లో 'మెమో' అనే ఫీచర్ ఉంటుంది. మనకు తోచిన ఏ మేటర్ అయినా అందులో టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. 'టూల్స్' అనే ఫీచర్ లో ఫైల్ మేనేజర్ తో పాటు మెమో అనే ఫీచర్ ఉంటుంది. ఇందులో ఫోటోతో పాటు తో మేటర్ రాయాలనుకునేవారికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
డౌన్లోడ్ ఇలా...
ఏదైనా యాప్ ను download చేసుకునే ఆప్షన్ ప్లే స్టోర్. ప్లే స్టోర్ లోకి వెళ్లి 'నోట్' అని టైప్ చేస్తే చాలు. చాలా రకాల notes అనేక ఫీచర్స్‌తో మనకు కనిపిస్తుంటాయి. మీకు నచ్చిన నోట్ ను ఎంపిక చేసుకోవచ్చు. 'కలర్ నోట్' కూడా అలాంటి ఒక యాప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని, దానిని ఓపెన్ చేసి, అవసరమైన సెట్టింగ్స్ కావాలనుకుంటే మార్చుకోవచ్చు. లేదా వాడుకను బట్టి ఫైల్స్ క్రియేట్ చేస్తూ వెళుతుంటే తేలికగానే అర్థమవుతుంది.
Authorization