టెక్నాలజీ దూసుకుపోతున్న నేపథ్యంలో కంప్యూటర్లు, మొబైల్స్ మనల్ని శాసిస్తున్నాయి. అవి లేనిదే పనిగడవటం లేదు. ముఖ్యంగా కంప్యూటర్లో పని చేస్తుంటే కాల్స్ ఎత్తాలన్నా తీరిక ఉండదు. ఈ నేపథ్యంలోనే చాలా ముఖ్యమైన కాల్స్ మనం ఒక్కోసారి అందుకోలేకపోతుంటాం. అయితే ఇప్పుడు అలాంటి బెంగ లేకుండా మీరు ఫోన్ కాల్స్ కూడా కంప్యూటర్ నుంచే రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం థర్ట్‌పార్టీ సాఫ్ట్వేర్స్ ఇంటర్నెట్లో లభ్యమవుతున్నాయి. ఈ టూల్స్ ఉపయోగించుకుని ఆండ్రాయిడ్ ఫోన్‌కు వచ్చే కాల్స్‌ను నేరుగా మీ కంప్యూటర్ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు. కంప్యూటర్‌తో పాటు ఓ మంచి హెడ్ ఫోన్ మైక్ ఉంటే చాలు. మరి ప్రాసెస్ ఎలాగో చూద్దాం.
ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో రిమోట్ ఫోన్ కాల్ అనే కూల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. తరువాత మీ కంప్యూటర్లో కూడా కాల్‌సెంటర్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది పూర్తయిన తరువాత లాంచ్ చేయాలి.
ఐపీ అడ్రస్, పాస్వర్డ్: మీ మొబైల్ ఫోన్లోని రిమోట్ కాల్ యాప్ లాంచ్ అయిన వెంటనే డివైస్ ఐపీ అడ్రస్, పాస్వర్డ్ కనిపిస్తాయి.
యాడ్ వై -ఫై డివైస్: ఇప్పుడు కంప్యూటర్లోని కాల్ సెంటర్ యాప్‌లోకి వెళ్లి యాడ్ వై -ఫై డివైస్ ఆప్షన్ క్లిక్ చేసి ఐపీ అడ్రస్ ఎంటర్ చేయాలి. నెట్ వర్కుకు సంబంధించిన పాస్ వర్డును ఎంటర్ చేయాలి.
ప్రాసెస్ విజయవంతమైన వెంటనే: ఈ సింకింగ్ ప్రాసెస్ విజయవంతమైన వెంటనే మీ నెట్‌వర్క్‌కు సంబంధించిన నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. ఈ కోడ్‌ను విండోస్ టూల్లో ఎంటర్ చేస్తే మీ ఫోన్ పీసీకి కనెక్ట్ అయిపోతుంది.
సెటప్ చేసుకోవటం ద్వారా: మీ విండోస్ పీసీ కాల్ సెంటర్‌ను సెటప్ చేసుకోవటం ద్వారా నేరుగా మీ కంప్యూటర్ నుంచి ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్లను సెండ్ చేసుకునే వీలుంది. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా మీ ఫోన్ కాల్ లాగ్స్ పీసీలో సింక్ అయిపోతాయి.
అన్ని కాంటాక్ట్స్ కంఫ్యూటర్లో: ఈ యాప్‌తో ఫోన్లోని అన్ని కాంటాక్ట్స్ కంఫ్యూటర్లో కనిపిస్తాయి. కాల్ లాగ్ సింక్ అవుతుంది. కాల్స్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, ఎస్ఎంఎస్లను చదవొచ్చు , పంపొచ్చు, కావాల్సిన కాంటక్ట్స్‌ను సెర్చ్ చేసుకోవచ్చు.
ఆడియో సెట్టింగ్స్: ఆడియో సెట్టింగ్స్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. ఇన్కమింగ్ కాల్స్ ఇంకా మేసేజ్‌లకు సంబంధించి పాపప్స్ వస్తాయి.
క్లిప్ బోర్డ్ నుంచే: క్లిప్ బోర్డ్ నుంచే డయలింగ్ నెంబర్స్ పొందేందుకు ప్రత్యేకమైన హట్ కీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే సమయంలో ఇన్కమింగ్ కాల్స్‌ను యాక్సెప్ట్ చేసేందుకు హట్కీని సెటప్ చేసుకోవచ్చు.
Authorization