ల్యాప్‌టాప్ పై ముఖ్యమైన పని చేస్తున్నారు. అప్పుడు అనేకోకుండా బ్యాటరీ పవర్ తగ్గిపోయి ఆ ల్యాప్‌టాప్ పనిచేయడం మానేస్తే ఆ చికాకు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ల్యాప్‌టాప్‌తో బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి సమస్య ఎదురైతే మరింత చిరాగ్గా ఉంటుంది. అందుకే అలాంటి సమయంలో డివైజ్ బ్యాటరీ ఛార్జింగ్ స్థాయిని చెక్ చేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చేందుకు అందుబాటులోకి వచ్చిన ల్యాప్‌టాప్‌లకు బ్యాటరీ అనేది ఎంతో కీలకంగా మారింది. బ్యాటరీ చార్జింగ్ లేకుంటే ల్యాపీ స్పందించటం మానేస్తుంది. అందుకే మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌ను మరింతగా పెంచుకునేందుకు 10 మార్గాలను అనుసరించండి...
- ల్యాప్‌టాప్‌కు జతచేసిన అన్ని యూఎస్బీ ఆధారిత ఎక్సటర్నల్ డివైస్‌లను తొలగించటం ద్వారా ల్యాపీ బ్యాటరీ లైఫ్‌ను మరింతగా పెంచుకోవచ్చు.
- సీడీ లేదా డీవీడీ డ్రైవ్‌లను ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచటం వల్ల ల్యాపీ బ్యాటీరీ లైఫ్‌ను ఆదా చేసుకోవచ్చు.
- ల్యాప్‌టాప్ ఎల్సీడీ స్క్రీన్ బ్రైట్నెస్ను సాధ్యమైనంత తగ్గించుకోవటం వల్ల బ్యాటీరీ లైఫ్‌ను ఆదా చేసుకోవచ్చు.
- స్పీకర్లను మ్యూట్‌లో పెట్టుకోవటం, మల్టీ మీడియా సాఫ్ట్వేర్లకు దూరంగా ఉండటం ద్వారా ల్యాప్‌టాప్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
- స్క్రీన్ సేవర్లను స్విచ్ ఆఫ్ చేయటం ద్వారా బ్యాటరీని ఎంతో కొంత మేర ఆదా చేసుకోవచ్చు.
- ల్యాప్‌టాప్ పై పనులను వీలైనంత తక్కువ వ్యవధిలో నిర్వహించుకోవటం ద్వారా బ్యాటరీ చార్జింగ్‌ను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.
- ల్యాప్‌టాప్‌ను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోవటం ద్వారా కూడా బ్యాటరీ చార్జింగ్ ఆదా అవుతుంది.
- అధిక వేడి ల్యాప్‌టాప్ బ్యాటరీ బ్యాకప్‌ను దహించివేస్తుంది. కాబట్టి మీ ల్యాప్‌టాప్ ఎప్పటికప్పుడు వేడి వాతావరణానికి దూరంగా ఉంచండి.
- ల్యాప్‌టాప్‌లోని సాఫ్ట్వేర్ ఇంకా డ్రైవర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండటం ద్వారా బ్యాటరీ జీవితాన్ని మరింతగా పొడిగించవచ్చు.
- ల్యాప్‌టాప్ బ్యాటరీని చార్జ్ చేసే క్రమంలో ఓరిజినల్ అడాప్టర్‌ను మాత్రమే ఉపయోగించడం మంచిది.
Authorization