మీకు ప్రావిడెంట్ ఫండ్ వస్తోందా.. అయితే దాని వివరాలు తెలుసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా.. అయితే ఇక మీరు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. గతంలోలాగా మీ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవడం కోసం మీ సమయాన్ని వృథా చేసుకొని హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీ చేతిలో మొబైల్, అందులో నెట్ ఉంటే చాలు ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. చాలా సింపుల్‌గా మీకు దానికి సంబంధించిన వివరాలు లభిస్తాయి..
మీ చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం కోసం నాలుగు రకాల ఆప్షన్లను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ అందుబాటులోకి తీసు కొచ్చింది. అవేంటో తెలుసుకుందాం.
Umang App
మీ స్మార్ట్‌ఫోన్‌లో Umang App ను ఇన్స్టాల్ చేసుకుంటే మీ పీఎఫ్ బాలన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
- ప్లే స్టోర్‌లో Umang App ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి.
- మీ రిజిస్టర్ నెంబర్‌తో యాప్‌లో లాగ్ ఇన్ అవ్వండి.
- టాప్ లెఫ్ట్ కార్నెర్‌లో ఉన్న హారిజాంటల్ బార్లను నొక్కండి.
- సర్వీస్ డైరెక్టరీలో నొక్కి EPFO ఎంపిక కోసం సెర్చ్ చేయండి.
- ఇప్పుడు కిందకి స్క్రాల్ చేసి View Passbook నొక్కి మీ మీ పీఎఫ్ బాలన్స్ ను చెక్ చేసుకోండి.
UAN portal లోకి లాగిన్ అవ్వండి..
ఒకవేళ యాప్‌ను యూజ్ చేయడం ఇష్టం లేకపోతే UAN portal ద్వారా లాగిన్ అవ్వండి.
- అకౌంట్ లోకి లాగిన్ అయిన తరువాత మీ KYC డిటెయిల్స్ వెరిఫై కాబడ్డాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ కానట్లయితే తప్పనిసరిగా వెరిఫై చేసుకోవల్సి ఉంది.
- తదుపరి స్టెప్‌లో భాగంగా full PF Settlement ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మీ పీఎఫ్ క్లెయిమ్‌ను వన్‌టైమ్ పాస్వర్డ్ ద్వారా చెక్ చేసుకోండి.
- ఈ వన్‌టైమ్ పాస్వర్డ్ అనేది మీ యూఏఎన్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు పంపబడుతుంది.
- తదుపరి స్టెప్‌లో భాగంగా ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ మీ వివరాలను పూర్తిగా వెరిఫై చేసి క్లెయిమ్ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లోకి ప్రాసెస్ చేస్తుంది.
మిస్డ్ కాల్ సర్వీస్
ఏ నంబర్ అయితే ఇస్తారో ఆ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కి మిస్ట్ కాల్ ఇస్తే మీ పీఎఫ్ ఖాతా వివరాలన్నీ మీ మీమొబైైల్ SMS ద్వారా క్షణాల్లో అందుతాయి. ఈ సేవలు పూర్తిగా ఉచితం. మీరు కచ్చితంగా మీ మొబైల్ నంబర్ యూఏఎన్ కి రిజిస్టర్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. వేరే నంబర్ నుంచి ట్రై చేస్తే SMS రాదు.
ఎస్ఎంఎస్తో ఈపీఎఫ్ వివరాలు
మీరు EPFO తో మీ UAN ను రిజిస్టర్ చేసుకుంటే, మీ PF ఖాతాకు సంబంధించి మీ ఇటీవలి లావాదేవీ వివరాలను పొందడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి 7738299899 కు EPFOHO UAN ENG ను టైప్ చేసి SMS పంపండి.
Authorization