గూగుల్ తన జీమెయిల్ యాప్‌లో మెటీరియల్ థీమ్‌ని అందించనుంది. అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్తగా వచ్చిన ఈ థీమ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే మీ జీమెయిల్ని క్లీన్ కూడా చేస్తుంది. మొత్తానికి పాత వాటికొన్నా సరికొత్తగా ఉంటుంది. ఈ మెటీరియల్ థీమ్‌కు సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందాం...
ఆండ్రాయిడ్ యూజర్లు జీమెయిల్ యాప్ ఓపెన్ చేయగానే ఓ గ్రీటింగ్ మెసేజ్ కనిపిస్తుంది. మీ జీమెయిల్ సరికొత్తగా వచ్చినట్టు తెలియజేస్తుంది. ఇందులో మీకు default, comfortable or compact అనే మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో మీకు నచ్చినది సెలక్ట్ చేసుకోండి.
పాత వాటిల్లో మార్పులు: ఈ యాప్ ద్వారా మీరు ఇన్ బాక్సులో పరిమిత మెయిల్స్‌ని మాత్రమే సెట్ చేసుకోవచ్చు.సెట్టింగ్స్‌లో కెళ్లి మీరు జనరల్ యాప్‌ని మార్చుకోవచ్చు. కొత్త మెటీరియల్‌లో భాగంగా కొత్త కలర్స్, మెయిల్స్ లాంటివి సరికొత్తగా వచ్చాయి.
ప్రొఫైల్ పిక్చర్: ఇప్పుడు మీ జీమెయిల్ అకౌంటుకి ప్రొఫైల్ పిక్చర్‌గా ఏదైనా పెట్టుకోవచ్చు. లైఫ్ట్ సైట్ స్క్రీన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అందులో మీరు మీ పిక్ ని పెట్టుకోవచ్చు.
న్యూ మెటీరియల్: మీరు ఈ మెయిల్లోకి ప్రవేశించకుండానే ఇన్ బాక్స్‌ను చూసుకునే అవకాశాన్ని ఈ కొత్త మెటీరియల్ కల్పిస్తోంది. అంతేకాకుండా మీ మెయిల్‌కు హ్యాక్ మెయిల్స్ వస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది.
Authorization