టెక్నాలజీకి తగినట్టు ఎప్పకప్పుడు టెక్ దిగ్గజం గూగుల్ తనదైన రీతిలో కొత్త ఫీచర్స్‌ను అందిస్తూ వస్తోంది. హ్యాకర్లు రోజు రోజుకు తమ ప్రతాపాన్ని చూపిస్తుండటంతో గూగుల్ కూడా సెక్యూరిటీ పరంగా భారీగానే కసరత్తు చేస్తోంది. ఈ తరహాలో మరో కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే గూగుల్ కాన్ఫిడెన్సియల్ మోడ్‌ని ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా జీమెయిల్ ద్వారా పంపిన మెయిల్స్ రహస్యంగా ఉంచబడతాయి. ఈ కొత్త అప్డేట్ ద్వారా పంపిన మెసేజ్ ఎప్పటివరకు ఉండాలనుకుంటే అప్పటివరకు సమయాన్ని నిర్ధారించుకోవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా అది డిలీట్ అయిపోతుంది. ఏ మెసేజ్‌కి అయితే ఎక్సపైరీ ఇవ్వాలనుకుంటున్నారో దానికే మీరు సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక రోజు నుంచి 5 సంవత్సరాల వరకు సమయం వరకు నచ్చిన విధంగా ఈ మెయిల్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం అదనంగా సెక్యూరిటీ ఫీచర్SMS passcodeని ఆఫర్ చేస్తోంది. ఏ మెయిల్ ద్వారా అయినా self-destruct mailని యాక్సస్ చేసుకోవచ్చు. మీరు పంపిన మెయిల్ ఈ తేదీలోగా ఎక్సపయిరీ అవుతుందని మెసేజ్ అందుకున్న వ్యక్తికి నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ మెయిల్ గడువు ముగిసిన తరువాత దానిని ఓపెన్ చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాగా ఈ ఫీచర్ న్యూ జీమెయిల్ వర్షన్ వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓల్డ్ వర్షన్ వాడుతున్న వారు కొత్త వర్షన్ కి అప్ డేట్ అయి ఈ ఫీచర్ ని పొందవచ్చు.
వాడాల్సిన విధానం
ముందుగా కంపోజ్ బాక్స్‌లోకి వెళ్ళి, అక్కడ ఎవరికయితే రహస్య మోడ్‌లో మెయిల్ పంపాలనుకున్నారో వారి మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. మెయిల్ రాసిన తరువాత అక్కడ కనిపించే లాక్ ఐకాన్ని చెక్ చేయాలి. ఇది ఇమేజ్ ఐకాన్ పక్కన ఉంటుంది. అందులోకి వెళ్లి మీరు గడువు తేదీని నిర్ణయించుకోండి.ఉదాహరణకు ఈ రోజు పంపిన మెయిల్‌ని రేపటి వరకు మాత్రమే ఉంచుకోవాలనుకుంటే రేపటి తేదిని ఎంటర్ చేయాలి. కావాలనుకుంటే SMS passcodeని ఎంటర్ చేసుకోవచ్చు. ఓ సారి చెక్ చేసుకుని confidential Gmailని పంపించుకోవచ్చు.
అందుకున్న వారికిలా..
మెయిల్ అందుకున్న రిసీవర్ ఈ కింది విధంగా నోటిఫికేషన్ అందుకుంటాడు. ''Content expires march 16, 2019. Options to forward, download, or copy this emails contents and attachments are disabled'' రిసీవర్ కేవలం దానికి రిప్లయి మాత్రమే ఇవ్వగలడు.
Authorization