అరుణగ్రహం (అంగారక గ్రహం) అంతరాళంలో భూగర్భ జలం ఉన్నట్టు, ఉపరితలంపై ఏర్పడ్డ ఇసుక తిన్నెలు, సమతల ప్రాంతాల ఆధారాల వల్ల ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అంగారకుడి భౌగోళిక అంచులలో నీటి ఉనికిని కనుగొన్నట్టు వెల్లడించారు. ఈ నీటి జాడ 750 మీటర్ల లోతులో ఉన్నట్టు భావిస్తున్నారు. నీరు ప్రవహించి ఎండిపోయినట్టుగా ఉన్న మార్గాలు, మార్గాల్లో కొన్నిచోట్ల బిలం గోడలపై కనిపించే నీటి ప్రవాహాలు వంటివి శాస్త్రవేత్తలు గతంలో గుర్తించారు. ఈ లక్షణాలను నీటి ఉపరితల ప్రవాహంగా భావించినట్టు మార్స్ ఎక్స్ప్రెస్ సౌండింగ్ రాడార్ ఎక్ప్పరిమెంట్ మార్సిస్కు చెందిన సభ్యుడు ఎస్సమ్ హెగ్గీ వెల్లడించారు. కానీ అది నిజం కాకపోవచ్చని, పగుళ్ళ నుంచి నీరు ఉబికి వచ్చే మరో విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించినట్టు వెల్లడించారు. 'మా పరిశోధనల నుంచి పొందిన అనుభవాన్ని బట్టి జల శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఒక నిర్ణయానికి వస్తాం.. నార్త్ ఆఫ్రికన్ సహరాలో, అరేబియా ద్వీపకల్పంలో చేసి ఫలితం సాధించిన ప్రయోగాన్ని మార్స్లోనూ చేసేందుకు సిద్ధమవుతున్నాం' అని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందిన అబోటాలిబ్ జడ్ అబోటాలిబ్ వెల్లడించారు. గతేడాదిలో దక్షిణ ధ్రువం మంచు కప్పులో చెరువు ఆనవాళ్ళు గుర్తించిన విషయం తెలిసిందే..
Authorization