భారీ రేటుతో విడుదలైన రెడ్మి నోట్ 5 ప్రో ఫోన్ 4 జీబీ ర్యామ్ ధర రూ.10,999 నుంచి ప్రారంభమౌతోంది. 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. ఈ ఫోన్లపై ఏకంగా రూ.5,000 వరకు తగ్గింపును ఇస్తోంది. ఏప్రిల్ 13 వరకు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు పోకో ఎఫ్1, రెడ్మి 6, రెడ్మి నోట్ 6 ప్రో వంటి పలు మోడళ్లపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. 32 జీబీ మెమరీ వేరియంట్‌తో ఉన్న రెడ్మి 6 ఫోన్ రూ.6,999 కు లభిస్తుంది. 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. రెండు ఫోన్లపై రూ.2,000 తగ్గింపు లభిస్తోంది.
రెడ్మి నోట్ 6 ప్రో ఫోన్ రూ.11,999కు అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. ఇక 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఈ ఫోన్లపై రూ.4,000 వరకు తగ్గింపు లభిస్తోంది. రెడ్మి వై2 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.7,999, 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్లపై రూ.3,500 తగ్గింపు లభిస్తోంది. పోకో ఎఫ్1 ఫోన్‌పై రూ.4,000 వరకు తగ్గింపు ఉంది. ఈ ఫోన్ ధర రూ.17,999 నుంచి ప్రారంభమౌతోంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. ఇక రెడ్మి గో స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి డిస్కౌంట్ లేదు. అయితే ఈ ఫోన్‌ను ఎప్పుడైనా కొనొచ్చు.
Authorization