టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 7 ఫోన్ ఫాస్ట్ అండ్ స్మూత్ ట్యాగ్‌తో మార్కెట్లోకి రానుంది. ఇందుకు సంబంధించి రోజుకో వార్త ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది. ఆ వార్తలను బ్రేక్ చేస్తూ సీఈవో పీట్ లౌ వన్‌ప్లస్ 7 టీజర్‌ను విడుదల చేశారు. వన్‌ప్లస్ నుంచి వస్తున్న కొత్త ప్రొడక్టును అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఫాస్ట్ అండ్ స్మూత్ పదాలకు కొత్త నిర్వచనం చెబుతుందని, ఇది చాలా అందంగా ఉంటుంది అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు వన్‌ప్లస్ 7 సిరీస్‌లో మూడు ఫోన్లు మార్కెట్లోకి రావొచ్చనే అంచనాలున్నాయి. తాజా టీజర్ అంచనాలకు బలాన్ని చేకూర్చుతోంది. వీటి పేర్లు వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 ప్రో 5జీ అయ్యి ఉండొచ్చు. వన్‌ప్లస్ 7లో 6.4 అంగుళాల స్క్రీన్, వాటర్‌డ్రాప్ డిస్ప్లే, 48 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉండొచ్చు. ఇక వన్‌ప్లస్ 7 ప్రో ఫోన్లో 6.64 అంగుళాల క్వాడ్ హెడ్డీ ప్లస్ సూపర్ ఆమ్లెడ్ కర్వ్డ్ డిస్ప్లే, పాపప్ సెల్ఫీ కెమెరా, 48 ఎంపీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లకు అవకాశముంది. కంపెనీ మే 14 ఈ ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసే అవకాశముంది. ఈ ఫోన్లలో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
Authorization