ఆండ్రాయిడ్ అనేది శక్తివంతమైన ఆపరేటింగ్ సిస్టమ్. అత్యధిక శాతం మొబైల్స్ ఈ ఓఎస్ ద్వారానే అందుబాటులో ఉన్నాయి. వినియోగించడానికి సౌకర్యవంతంగా ఉండడంతో మొబైల్ తయారీ దారులు దీనినే అందిస్తున్నారు. ఇందులో అనేక వెర్షన్లు ఉన్నాయి. ఇందులో యాప్స్ కోసం వినియోగించుకునే గూగుల్ ప్లేస్టోర్‌లో అనేక రకాల యాప్స్ ఉచితంగా అందుబాటులో ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు కొత్తవి వస్తున్నాయి. మనిషి జీవన ప్రమాణాలకు తగినట్టు తక్కువ సమయాన్ని వినియోగించుకుని త్వరగా కావాల్సిన పనిని పూర్తి చేసుకునే వెసులుబాటును కలిగిస్తున్నాయి. అందులోని రెండు యాప్స్ గురించి మీకోసం..
ఎవిరీ టైమర్ :
ఎవిరీ టైమర్ యాప్ ద్వారా ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై వంటి వాటిని ఏయే సమయాలలో పని చేయాలో నిర్ణీత సమయాన్ని సెట్ చేసుకుని ఉపయోగించుకునే వీలుంటుంది. ఆ తర్వాత అవి ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతాయి.
ఇన్స్టాల్ చేసుకోండిలా.. :
ప్లేస్టోర్ నుంచి ఎవిరీ టైమర్‌ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసేందుకు నెక్ట్స్ అని ఆప్షన్లు అడుగుతూ ఉంటుంది. అన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్తే యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అందులో సార్ట్ అని ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత వైఫై, బ్లూటూత్, మొబైల్ డేటా, వైబ్రేషన్ మోడ్, సౌండ్ మోడ్, మ్యూట్ అనేవి కనిపిస్తుంటాయి. వాటిలో దేనికి టైం సెట్ చేసుకోవాలో ఎంచుకోవాలి. తర్వాత టైం సెట్ చేసుకునేందుకు ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎంచుకునే వైఫై, బ్లూటూత్, మొబైల్ డేటా, వైబ్రేషన్ మోడ్, సౌండ్ మోడ్, మ్యూట్ వంటివి ఏవి ఎంత సమయం పని చేయాలో వాటిని ఎంచుకోవాలి. ఒకేసారి రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ టైం సెట్ చేసుకోవాలి. ఏయే వారాలలో అంటే సండే, మండే ఇలా ఆప్షన్లు చూపిస్తుంది. ఎప్పుడెప్పుడు కావాలో కూడా ఎంచుకునే వీలుంటుంది. ఓకే చేసేస్తే ఆ టైమింగ్స్ చూపిస్తుంది. ఆ టైమ్‌లో మాత్రమే ఎంచుకున్న టాగుల్ పని చేస్తుంది. ఇలా అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు కొన్ని యాప్స్‌ను కూడా యాడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. అవి కూడా నిర్ణయించుకున్న టైం లోనే పనిచేస్తాయి.
మల్టీ టాస్కింగ్ :
మనం సాధారణంగా ఒక సారి ఒక అప్లికేషన్‌తోనే వర్క్ చేయగలం. ఒకే సారి రెండు మూడు యాప్‌లను ఉపయోగించలేం. మల్టీ టాస్కింగ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా రెండు మూడు అప్లికేషన్‌ను రన్ చేయవచ్చు. అది కూడా ఈ మల్టీ టాస్కింగ్ యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ యాప్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.
ఉపయోగించండిలా.. :
యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పైన ప్లే సింబల్ కనిపిస్తుంది. తర్వాత మొబైల్ ఎడమ వైపు నుంచి చిన్నగా స్వైప్ చేసినట్టు అంటే.. ఒక మెనూ బార్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెట్ బ్రౌజ్ చేస్తున్నపుడు వాట్పాస్ కానీ, వేరే ఇంకేదైనా యాప్ ఉపయోగించాల్సి వస్తే.. ఎడమ వైపుస్వైప్ చేస్తే మెనూ బార్ వస్తుంది. అందులో నుంచి మనకు కావాల్సిన అప్లికేషన్ ఉపయోగించుకోవచ్చు.ఇలా ఒకేసారి రెండు లేదా మూడింటినీ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇందులో కొన్ని రకాల యాప్స్‌ని ఉపయోగించుకోవాలంటే మాత్రం ప్రొ వెర్షన్‌ని వాడాల్సి ఉంటుంది.
ఇదే తరహాలో లీనా డెస్క్‌టాప్ యాప్‌ని కూడాఉపయోగించుకోవచ్చు. ఇందులో లీనాను టాప్ చేస్తే మొబైల్ ఫీచర్లు మారుతాయి. ఇందులో స్క్రీన్ రొటేషన్ చేసుకోవచ్చు. కుడివైపు పై భాగంలో ఉండే సెట్టింగ్స్‌ను క్లిక్ చేస్తే అనేక ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. అందులో కావాల్సినవి ఆన్ చేసుకోవచ్చు. కింది భాగంలో యాప్స్ కనిపిస్తాయి. వీటిలో మనకు కావాల్సిన యాప్ ఏదైనా ఓపెన్ చేయవచ్చు. యాప్ సైజును చిన్నగా, పెద్దగా, కావాల్సిన విధంగా మార్చు కోవచ్చు. ఆ యాప్ అలాగే ఉండి మరో యాప్ కావాలనుకుంటే దానిని కూడా ఓపెన్ చేయవచ్చు. ఆ యాప్‌ను కూడా కావాల్సిన విధంగా సైజ్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇవి చూడడానికి ఒకే స్క్రీన్ మీద వెనుక ముందు కనిపిస్తుంటాయి. ఇలా ఒకేసారి రెండు మూడు ఉపయోగించవచ్చు. ఈ తరహా లోనే లీనాతో పాటు మరికొన్ని యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏక కాలంలో విభిన్న రకాల పనులు చేస్తూ తమ లక్ష్యం వైపు సాగిపోయే వారికి ఇలాంటి యాప్స్ ఎంతో ఉపయుక్తం.
Authorization