మన మనసులో ఉన్న భావాలను ఇతరులతో పంచుకోవడానికి, మనలోని ప్రతిభను చూపించడానికి బ్లాగ్ ఒక సాధనం. ఇందులో కథలు, కవితలు, సినిమాల గురించి, వంటలు, ఫ్యాషన్, రాజకీయం ఇలా విషయం ఏదైనా సరే ఆసక్తి ఉన్న అంశాన్ని లేదా ఒక అంశం, ఘటనకు సంబంధించిన అభిప్రాయాన్ని ఇతరులతో పంచుకోవడానికి, తెలియని వారికి తెలియజేయడానికి బ్లాగింగ్ చాలా బాగా ఉపయోగపడుతున్నది. ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి వచ్చినప్పటికీ కొందరు బ్లాగ్ రాస్తున్నారు. అందులోని కంటెంట్‌తో పుస్తకాలూ తీసుకొస్తున్నారు. ఎక్కువ మందికి చేరువ అవుతున్నారు. కనుక ఇప్పటికీ బ్లాగింగ్‌కు ఆదరణ ఉంది.
ఒక అంశంపై పూర్తిస్థాయి సమాచారాన్ని అందిస్తూ అనేక మందిని బ్లాగ్‌లో ఇంటరాక్ట్ అయ్యేలా చేసే దానినే బ్లాగ్ అంటాం. బ్లాగ్‌ను క్రియేట్ చేసేబ్లాగ్ను క్రియేట్ చేసేవారిని బ్లాగర్స్ అంటారు. బ్లాగ్లు ప్రారంభమై దశాబ్దరన్నర దాటినా గడిచిన రెండు మూడేండ్ల నుంచే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి. రాసే అంశం నచ్చిన వారు ఉంటే ఆ బ్లాగ్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతారు. కొంచెం ఖర్చుతో కూడుకున్నవే అయినా సరిగా నిర్వర్తిస్తే బ్లాగుల నుంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎందులో ఆసక్తి ఉంటే అందుకు సంబంధించి రాసి, అందరితో పంచుకునే వీలుంటుంది.
రకాలు..
బ్లాగులు రెండు రకాలు.. నాన్పేయబుల్, పేయబుల్. నాన్ పేయబుల్లో బ్లాగ్స్పాట్లో ఆసక్తిని బట్టి బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో డొమైన్ పేరు, హోస్టింగ్లను సదరు సైట్ నుంచే ఉచితంగా తీసుకోవచ్చు. అందులో వచ్చే వ్యూవ్స్‌ను బట్టి వచ్చే రేటింగ్‌ను, తద్వారా వచ్చే ఇన్కమ్ సైట్‌కే చెందుతాయి. కేవలం బ్లాగ్‌లో రాసే అంశాలకు పేరు మాత్రమే వస్తుంది. ఇందులో మనం క్రియేట్ చేసుకునే అకౌంట్ పేరుకు సదరు బ్లాక్ పేరుతో కలిపి డాట్ కామ్, డాట్ ఇన్ వంటివి చేరుతుంటాయి. ఉదాహరణకు నవీన్ అనే వ్యక్తి ఉచితంగా బ్లాగును క్రియేట్ చేయాలనుకున్నాడు. బ్లాగ్స్పాట్ లేదా వర్డ్‌ప్రెస్ ద్వారా బ్లాగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అతను పెట్టే పేరును బట్టి నవీన్ఏబ్లాగ్స్పాట్.కామ్ లేదా నవీన్ఏవర్డ్ప్రెస్.కామ్ అని క్రియేట్ అవుతుంది. అదే పేయబుల్ బ్లాగ్‌ను క్రియేట్ చేసుకుంటే మనం ఎంచుకునే హోస్టింగ్‌ను బట్టి పేరుతో పాటు డాట్ కామ్, డాట్ ఇన్, డాట్ నెట్ వంటివి చేరుతుంటాయి. వీటిలో ఇక్కో దానికి ఒక్కో ధర ఉంటుంది. అంతేకాదు ఎంచుకునే హోస్టింగ్ స్పేస్‌ను బట్టి ధరను సదరు సైట్లు నిర్ణయిస్తారు. ఇందులో అన్లిమిటెడ్ కూడా తీసుకోవచ్చు. ఎంత జీబీ తీసుకోవాలనేది బ్లాగ్ నిర్వహించే వారి ఆలోచన, రాసే జర్నల్స్‌ను బట్టి, కేటాయించుకునే విభాగాలను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు వంటలకు సంబంధించి బ్లాగు నిర్వహించాలనుకుంటే పిండి వంటలు, పచ్చళ్ళు, స్నాక్ ఐటమ్స్, వెజ్ కర్రీస్లు, నాన్‌వెజ్ కర్రీస్ ఇలా వెరైటీలకు తగినట్టు ఫోల్డర్లు పెట్టాలనుకుంటే స్సేస్ ఎక్కువగా అవసరం పడుతుంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలనుకుంటే పెట్టే పోస్ట్‌ను బట్టి హోస్టింగ్ తీసుకోవాల్సి ఉంటుంది.
బ్లాగ్‌ను క్రియేట్ చేయడానికి..
బ్లాగ్‌ను క్రియేట్ చేయ డానికి బ్లాగర్, వర్డ్‌ప్రెస్, థంబ్లర్ వంటి ఫ్లాట్ఫార్మ్లు అందు బాటులో ఉన్నాయి. ఇందులో బ్లాగర్లో మనం అకౌంట్ క్రియేట్ చేయాలంటే జీమెయిల్ ఉంటే సరిపోతుంది. గూగుల్ సెర్చ్‌లో బ్లాగర్ అని టైప్ చేస్తే క్రియేట్ యూనిట్ అండ్ క్రియేటివ్ బ్లాగ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే క్రియేట్ యువర్ బ్లాగ్ అని అడుగుతుంది. ఇందులో జీమెయిల్ అకౌంట్‌తో సైన్ఇన్ అవ్వొచ్చు. ఉదాహరణకు ఛానెల్ పేరు శృతి టెక్నాలజీ అని పెట్టాలనుకుంటే అదే అందులో టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్‌కు సంబంధించి డొమైన్ తీసు కోవాల్సి ఉంటుంది. మనం పెట్టాలనుకున్న పేరు అప్పటికే రిజిస్టర్ అయి ఉంటే ట్రై అనదర్ నేమ్ వన్ అని చూపిస్తుంది. పేరు మార్చుకుని చేస్తే బ్లాగ్ అడ్రస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు డొమైన్ పేరు శృతి టెక్.బ్లాగ్స్పాట్.కామ్ అని క్రియేట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టని వాళ్ళు ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉంటే గోడాడీ లాంటి సైట్స్‌లో డొమైన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అలా చేస్తే ఎంచుకున్న పేరుతో పాటు డాట్ కామ్, డాట్ నెట్ వంటివి వస్తాయి. తర్వాత కింద థీమ్స్ ఉంటాయి. నచ్చిన థీమ్స్‌ను ఎంచుకుని క్లిక్ చేస్తే బ్లాగ్ ఓపెన్ అవుతుంది.
పోస్ట్‌లు పెట్టాలంటే...
న్యూపోస్ట్ పెట్టాలంటే.. టెక్ట్స్ కాని, ఫొటోలు కాని, వీడియోలు కానీ ఏవైనా సరే సంబంధిత లింక్‌లకు సంబంధించిన ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి పోస్ట్ చేయాలనుకున్న కంటెంట్ లొకేషన్‌ను ఓపెన్ చేసి, అప్లోడ్ చేయవచ్చు. ఒక వేళ యూట్యూబ్‌కు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్నా, అందుకు సంబంధించిన యూఆర్ఎల్ను కాపీ చేసి, పెట్టాలనుకున్న స్థానంలో పేస్ట్ చేసేయొచ్చు. పోస్ట్ చేసే ముందు కంటెంట్‌ను ఒకసారి ప్రీ వ్యూ కూడా చూసుకోవచ్చు. అలా చూడడం వల్ల మనం పంపిస్తున్న కంటెంట్ లేఅవుట్ ఎలా ఉందనేది ముందుగానే చెక్ చేసుకోవచ్చు. ఏవైనా థీమ్స్ మార్చుకోవాలనుకున్నా, కంటెంట్‌లో మార్పులు చేయాలనుకున్నా చేసేసి పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ పెట్టేపుడు సోషల్ నెట్వర్క్ సైట్స్ కింద ఉంటాయి. వాటిని ఎంచుకుంటే ఆయా సైట్లలో మీరు పెట్టాలనుకున్న పోస్ట్ వెళ్ళిపోతుంది. పంపిన కంటెంట్‌ను ఎంత మంది, ఎప్పుడు, ఎక్కడ నుంచి చూశారనేది కూడా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఉద్యోగాలు వదిలి బ్లాగర్లుగా..
కొంతమంది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లక్షల్లో సంపాదన వదిలేసి బ్లాగ్‌ను నిర్వహిస్తున్న వారున్నారు. కొంతమంది పాషన్‌తో వస్తే, మరికొంత మంది పాషన్‌తో పాటు ఆదాయాన్ని పొందేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సరైన నిర్వహణ తెలిస్తే బాగానే సంపాదించవచ్చు. అందుకే చాలా మంది బ్లాగింగ్‌ను కెరీర్‌గా మలుచుకుని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడంతో పాటు ఆదాయాన్ని పొందుతున్నారు.
యాడ్స్ కోసం..
2018లో గూగుల్ తెలుగు బ్లాగులకు యాడ్స్సెన్స్ ఇచ్చింది. అంటే తెలుగులో చేసే వీడియోలు, రాసే కథనాలు ఏవైనా సరే ఎక్కువ వ్యూవ్స్ వస్తే అవి కూడా యాడ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. హోస్టింగ్స్ను కొనుగోలు చేసేందుకు చాలా సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకు గోడాడీ, హోస్టింగ్ ఎడిటర్, బ్లూహోస్ట్ వంటి సైట్లు ఉన్నాయి. రెగ్యులర్‌గా పోస్టులు పెడుతూ ఉంటే యాడ్లను మన కంటెంట్‌కు అప్లోడ్ చేయవచ్చు. అయితే మొదటిసారి బ్లాగ్ క్రియేట్ చేసిన వారు కనీసం 20 రోజుల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. దానితో పాటుగా అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. ఆ తర్వాత యాడ్స్‌ను అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బ్లాగ్‌కు ఫాలోవర్లు ఎక్కువ అవుతుంటే, వ్యూవ్స్ పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో కంపెనీ వాళ్ళే కొన్ని ప్రమోట్ చేస్తుంటారు. కంటెంట్ చూసే వారు యాడ్‌పై క్లిక్ చేసినా, యాడ్ క్లోజ్ చేసినా బ్లాగర్‌కు ఆదాయం వస్తుంది. యాడ్స్‌కు సంబంధించి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు చాలా రకాల అఫ్లియేట్ సైట్స్ ఉంటాయి. వీటికి అనుబంధంగా ఉన్న యాడ్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు.
ఆదాయం పెరగాలంటే..
- మార్కెట్లో ఇంట్రస్ట్ ఉన్న టాపిక్ ఎంచుకోవాలి. ఆకట్టుకునేలా రాయగలగాలి. లేదా కంటికి నచ్చేలా ఫొటోలు పెట్టగలగాలి. వీడియోలు చేస్తుంటే ఆసక్తి కలిగించే వీడియోలు చేయాలి.
- బ్లాగ్ లుక్ చాలా ముఖ్యమైంది. అందుకు బ్లాగ్‌ను డిజైన్ కండ్లకు నప్పేలా డిజైన్ చేసుకోవాలి. ముఖ్యంగా రంగులు, డిజైన్లు ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు.
- ఎక్కువ కంటెంట్ రాయడం, మార్కెట్ చేయడం వంటివి సరిగా చేయడం ఇందులో చాలా ముఖ్యం.
- ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం కూడా చాలా ముఖ్యం. బ్లాగ్ ఎక్కువ మందికి చేరాలంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఓఈ), సోషల్ మీడియా మార్కెటింగ్‌లు మాత్రమే ముఖ్య సాధనాలు. చేసే వీడియోలు, రాసే ఆర్టికల్స్ ఏవైనా అందరికీ చేరాలన్నా మార్కెటింగ్ తప్పనిసరి. ఇందుకోసం ఎస్ఓఈ నేర్చుకోవాలి. సోషల్ మీడియాలైన ట్విట్టర్, ఫేస్బుక్ వంటి వాటికి లింక్అప్ అవ్వాలి. అందులో మన లింక్స్ అప్డేట్ అవుతూ ఉంటే.. చూసే వాళ్ళు పెరిగే కొద్ది యాడ్స్ వాటంతటే అవే వస్తుంటాయి. కేవలం ఆదాయం దృష్టితో మాత్రమే చూడకుండా పాషన్లో రాస్తుంటే ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం వస్తుంది.
Authorization