వొడాఫోన్.. పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను తీసుకు వచ్చింది. ఒక ప్లాన్‌పై 5 వరకు కనెక్షన్లు తీసుకోవచ్చు. అంటే ఒకే బిల్లుపై ఐదుగురు మాట్లాడు కోవచ్చు. ఆ ప్లాన్‌కు వచ్చే డేటాను ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు వీటిలో అపరిమిత కాల్స్ సదుపాయం కూడా ఉంది. అదే రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ కింద ఐదు కనెక్షన్లు తీసుకోవచ్చు. ఇందులో 200 జీబీ డేటా వస్తుంది. ఇందులో రోలోవర్ సదుపాయం కూడా ఉంది. ప్లే యాప్ ఫ్రీ యాక్సెస్ ఉంది. అమెజాన్ ప్రైమ్ సేవలు ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు. మొబైల్ ప్రొటెక్షన్ సదుపాయం ఉంది. అలాగే రూ.598, రూ.749, రూ.899 ప్లాన్లు కూడా అందు బాటులో ఉన్నాయి. ఇవి ఫ్యామిలీ ప్లాన్లు. ఇక ఒక్కో వినియోగదారుడుకు అయితే రూ.399, రూ.499 పోస్ట్ పెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలో అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంటుంది. అంతేకాదు రూ.899 ప్లాన్‌లో 4 కనెక్షన్లు తీసుకోవచ్చు. 160 జీబీ డేటా పొందొచ్చు. ఇక రూ.749 ప్లాన్‌లో 3 కనెక్షన్లు పొందొచ్చు. 120 జీబీ డేటా వస్తుంది. రూ.598 ప్లాన్‌లో ఇద్దరు 80 జీబీ డేటా పొందొచ్చు. యూజర్లకు రూ.499 ప్లాన్‌లో 75 జీబీ డేటా, రూ.399 ప్లాన్‌లో 40 జీబీ డేటా లభిస్తుంది.
Authorization