మోటరోలా తన మోటో ఇ సిరీస్ నుండి మరో కొత్త మొబైల్ ఫోన్ మోటో ఇ 6 ను విడుదల చేసింది. ఈ మోటో ఇ 6 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. దీని ధర రూ.10,300గా నిర్ణయించింది. మోటరోలా మోటో ఇ 6 ఆండ్రాయిడ్ 9 పై తో లాంచ్ చేయబడింది. ఫోన్ 5.5-అంగుళాల హెచ్డి+ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 720x1440 పిక్సెల్స్, 18 : 9 ఆస్పెక్ట్ రేషియాతో రానుంది.
మోటో ఇ 6, ఒక ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 లో SoC తో పనిచేస్తుంది. గరిష్టంగా 1.4GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇది అడ్రినో 505 GPU, 2GB ర్యామ్, 16 జిబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ మెమోరీ కింద 256 జిబి ఎస్డీ కార్డును ఉపయోగించుకోవచ్చు. 3,000 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీని అమర్చారు. ఇందులో 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాను ఎల్ఈడీ ఫ్లాష్‌తో అమర్చారు. ముందు కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంది. ఇది ఎపర్చర్ ఎఫ్ / 2.0 కలిగి ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉన్న డాట్ నోచ్-డిస్ప్లే లేదా పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను ఇవ్వలేదు. నేవీ బ్లూ, స్టీర్ బ్లాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఇందులోని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, గత సంవత్సరం విడుదల చేసిన మోటో ఇ 5 తో పోలిస్తే కొత్తగా వచ్చిన ఈ మోటో ఇ 6 పూర్తిగా అప్‌గ్రేడ్ మాత్రం చెయ్యలేదు. అంతేకాదు, కొన్ని ఫీచర్ల విషయంలో దీనిని డౌన్‌గ్రేడ్ చేశారు. సింగిల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంది. అయితే లాంచ్ సమయంలో డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను ఇచ్చారు.
Authorization