ఆధార్.. ప్రతి ఒక్కరికీ ఓటర్ ఐడీ కంటే ఎక్కువగా ఐడెంటిటీని తెలిపే కార్డు.. ఆధార్ ప్రారంభమైన నాటి నుంచి సెక్యూరిటీ పరంగా అనేక రూమర్లు చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మన కార్డును మనమే వాడుతున్నామా..? ఇంకెవరైనా వాడుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఇకపై కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఇప్పటి వరకు ఆధార్ ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవడం సులభం. ఇందుకు ప్రభుత్వం వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసింది. అందులో ఆధార్ కార్డు ఎప్పుడెప్పుడు వాడారోస్టేటస్ తెలుసుకోవచ్చు. అందుకు చేయాల్సినవి..
- ముందుగా ప్రభుత్వ అధికారిక UIDAI https://resident.uidai.gov.in/check-aadhaar-status లింక్ ఓపెన్ చేయాలి.
- పేజ్ ఓపెన్ అయ్యాక 12 అంకెల ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి. దీనితో పాటు కింద ఇచ్చిన సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- ఆధార్‌కు లింక్‌గా ఉన్న మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ కేవలం ముందుగా నమోదు అయిన మొబైల్ నంబరుకు మాత్రమే వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్‌కు సంబంధించిన వివరాలు ఓపెన్ అవుతాయి.
- ఏయే వివరాలు తెలుసుకోవాలనుకుంటే సంబంధితమైన వాటిని ఎంచుకోవలసి ఉంటుంది. అంటే, ఏ తేదీన కార్డు వినియోగం తెలుసుకోవాలనుకుంటే ఆ తేదీని ఎంచుకుంటే, అందుకు సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి.
- అయితే ఎక్కడ వాడారు అనే విషయం మాత్రం చెప్పడం కష్టం.
Authorization