హ్యాండ్ సెట్ తయారీ కంపెనీ మోటరోలా మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. దీని పేరు మోటరోలా వన్జూమ్. అదిరిపోయే ఫీచర్లతో ఉన్న ఈ కొత్త ఫోన్ లాంచ్‌కు కంపెనీ సిద్ధమౌతోంది. అయితే అధికారికంగా లాంచ్ చేయకపోయినా ఈ ఫోన్‌కు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో లీకైంది. దాని ప్రకారం ఈ ఫోన్లో 48 ఎంపీ కెమెరాతో కూడిన నాలుగు రియర్ కెమెరాలు ఉండనున్నాయి. గతంలో ఈ ఫోన్ పేరు మోటరోలా వన్ ప్రో అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పేరు మోటరోలా వన్ జూమ్ అని తెలుస్తోంది. ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్‌డ్రాప్ డిస్ప్లే ఉండొచ్చు. ఇందులో 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, భారీ సామర్థ్యం ఉన్న బ్యాటరీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లకు ఛాన్స్ ఉంది. కంపెనీ ఐఎఫ్ఏ 2019 ఈవెంట్ తర్వాత ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముంది. దీని ధర రూ.34,000 సమీపంలో ఉండొచ్చనే నివేదికలు వెలువ డుతున్నాయి. ఫోన్లో వెనుక భాగంలోని నాలుగు కెమెరాలు చతురస్ర ఆకారంలో ఉంటాయి. మరోవైపు మోటరోలా వన్ యాక్షన్ ఫోన్‌పై కూడా పని చేస్తోంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా, పంచ్ హోల్ డిస్ప్లే, రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉండే అవకాశముంది.
Authorization