ఈ కాలంలో చదువుకున్న వారు ఉన్న ప్రతి ఇంట్లో ఓ కంప్యూటర్ కచ్చితంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాతర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంటి అవసరాలకైనా, ఆఫీస్ అవసరాలకైనా కంప్యూటర్ కొనుగోలు చేసే కంప్యూటర్లలో ప్రాసెసర్, స్పీడ్, హార్డ్ డిస్క్, రామ్, ధర అనేవి చాలా కీలకం. వీటి పై కచ్చితమైన అవగాహన ఉంటే మంచి నాణ్యమైన పర్సనల్ కంప్యూటర్ను కొనవచ్చు.
ఇంటి అవసరాలకు పెద్ద సైజు డెస్క్ టాప్ కంప్యూటర్లను మంచివిగా చెప్పువచ్చు. ఇవి ఎక్కువ స్థలం ఆక్రమించుకున్నప్పటికి రిపేర్ చేసేందుకు చాలా అనువుగా ఉంటాయి. వీటి పనితీరును మరింతగా మెరుగుపరుచుకునేందుకు సెకండరీ హార్డ్ డ్రైవ్‌తో పాటు గ్రాఫిక్ కార్డులను యాడ్ చేసుకునే వీలుంటుంది. ఇక స్పీడ్ విషయానికి వచ్చేసరిరిì Intel Core i3, i5 and i7 ప్రాసెసర్ల తో వచ్చే కంప్యూటర్ ఎంపిక చేసుకోవటం ద్వారా మంచి క్వాలిటీ పనితీరును పొందవచ్చు.
బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్లు Core i 3 లేదా duel core సీపీయూలను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. ఇక ర్యామ్ విషయానికి వచ్చేసరికి మీరు ఎంపిక చేసుకునే డెస్క్ టాప్ పీసీలో మినిమమ్ 2జీబి నుండి 4 gb ర్యామ్ ఉండాలి. కొన్ని పర్సనల్ కంప్యూటర్స్ గురించి పరిచయం
Authorization