పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం కొంత వరకు మంచిదే. కానీ వారు ఫోన్‌ను మంచి పద్దతులలో ఉపయోగిస్తున్నారా లేదా అని తెలుసుకోవడం తల్లితండ్రులుగా మీ బాధ్యత. ఇందుకోసం కొన్ని నిఘా యాప్‌లు ఉన్నాయి. ఈ యాప్‌లు మీ పిల్లల స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ట్రాక్ చేస్తాయి. ఇందులో కొన్ని యాప్‌లు వారు ఎక్కడున్నారో కూడా తెలియజేస్తాయి. వీటిని ఉపయోగిస్తే మీ పిల్లల భద్రత గురించి ఇక మీరు ఆందోళన చెందాల్సిన అవసరమే ఉండదు.
MM గార్డియన్
పిల్లల వెబ్ యాక్సెస్, మెసేజ్ లు, యాప్స్ వినియోగంతో పాటు కాంటాక్ట్ లపై వీవీ గార్డియన్ పూర్తి నియంత్రణ ఇస్తుంది. దీని కోసం మీ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అకౌంట్ యాక్సిస్ కోసం వివరాలను నమోదు చేసుకోవాలి. ఆపై మీ పిల్లల ఫోన్లో చైల్డ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రెండు యాప్‌లను డౌన్లోడ్ చేసిన తర్వాత గార్డియన్ ను ఉపయోగించుకోవచ్చు. మీ పిల్లలు ఎక్కడున్నా తెలుసుకోడానికి ఇది మ్యాప్‌తో రావడమే కాక, షెడ్యూల్‌ను ఇన్పుట్ చేయడానికి, రోజులోని నిర్దిష్ట సమయాల్లో మీ పిల్లలను ట్రాక్ చేయడానికి వీలుంటుంది. అంతేకాకుండా ప్రమాదకర వెబ్సైట్లను నిరోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. పిల్లలు అవసరానికి మించి ఫోన్‌ను ఉపయోగిస్తున్నారనే అనుమానం వస్తే వారి ఫోన్‌ను నిర్దిష్ట సమయంలో లాక్ చేసే సమయ పరిమితులను కూడా సెట్ చేయవచ్చు.
గూగుల్ ఫ్యామిలీ లింక్
మీ పిల్లల ఇంటర్నెట్ వినియోగాన్ని, వారు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు గూగుల్ ఫ్యామిలీ లింక్‌ను ఉపయోగించండి. మీ ఫోన్లో, పిల్లల ఫోన్లు సంబంధిత యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ గూగుల్ ఫ్యామిలీ లింగ్ యాప్ ద్వారా మీ పిల్లలు ఇటీవల ఉపయోగించిన ప్రతి యాప్‌తో పాటు, యాప్ లలో గడిపిన సమయాన్ని కూడా మీకు చూడవచ్చు. పిల్లలు కొత్త యాప్‌ను డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు డౌన్‌లోడ్‌ను ఆమోదించడానికి లేదా నిరాకరించడానికి మిమ్మల్ని అనుమతించే నోటిఫికేషన్ కూడా మీకు ఉంటుంది. అలాగే వారి చదువుకు సంబందించిన యాప్‌లను ఉపయోగించే విధంగా చేయవచ్చు. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆల్ ట్రాకర్ ఫ్యామిలి
మీరు ఆడియో నిఘా యాప్ కోరుకున్నట్లయితే దీనికోసం ఆల్ ట్రాకర్ ఫ్యామిలీ యాప్ మంచి ఎంపిక. అయితే ఇందులో మరిన్ని అప్డేట్ పొందాలంటే సభ్యత్వంగా కొంత రుసుము చెల్లించాలి. ఫ్రీ వెర్షన్లో కూడా బాగానే ఉపయోగించుకోవచ్చు. పిల్లల ఫోన్ బ్యాటరీ స్థాయిని పర్యవేక్షించవచ్చు. వారు చివరిగా ఉపయోగించిన యాప్‌ను కూడా తనిఖీ చేయవచ్చు. అంతేకాకుండా వారి కాల్స్‌ను ట్రాక్ చేయవచ్చు అలాగే వారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. మెసేజ్‌లు, కాల్స్, ఫొటోలు అన్నీ పరిశీలించవచ్చు. నెలవారీ డబ్బులు చెల్లించినట్లయితే పిల్లల ఫోటోలు, వీడియోలకు యాక్సిస్ లభిస్తుంది. ఇది పిల్లల స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఫోన్ ద్వారా ఆడియో వినడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతేకాకుండా లైవ్ వీడియోను ప్రసారం చేయడానికి, స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఉపయోగించడానికి కూడా అనుమతిస్తుంది. మీ పిల్లల ఫోన్ కాల్‌లను అలాగే మైక్, కెమెరా నుండి రికార్డింగ్‌లను సేవ్ చేయడానికి, సమీక్షించడానికి మీరు ఆల్ ట్రాకర్ ఫ్యామిలీని ఉపయోగించవచ్చు.
ఫైండ్ మై కిడ్స్
ఈ యాప్ ఉపయోగించి మ్యాప్‌లో మీ పిల్లల స్థానాన్ని చూడటానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా ఉపాధ్యాయుడు, ఆయా, అతని స్నేహితులు మీ పిల్లలతో మాట్లాడే విషయాలను వినడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. వారు మీ పిల్లలతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నపుడు వారు సమాధానం ఇవ్వకపోతే మీరు మీ పిల్లల ఫోన్లో అలారం సెట్ చేయవచ్చు. పిల్లల ఫోన్ వైబ్రేట్లో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Authorization