రోజురోజుకు ఇంటర్నెట్ వినియోగం పెరుగుతూ ఉంది. ఇండ్లల్లో, కార్యాలయాల్లో, ప్రతి చోటా.. ప్రతి విషయానికి నెట్‌పైనే ఆధార పడుతున్నాం. మొబైల్ ఫోన్ ద్వారా డేటా ఉపయోగిస్తున్నప్పటికీ ఇండ్లలో సైతం ఇంటర్నెట్ కనెక్షన్ వాడకం ఉంటోంది. ఇలా ఇండ్లలో నెట్ కనెక్షన్ ఉపయోగించే వారందరికి రూటర్ తప్పనిసరిగా ఉంటోంది. నిత్యాసరంలో ఇది ఒక భాగమైంది. అయితే ఆ రూటర్‌లో ఏదైనా సమస్య ఏర్పడితే కచ్చితంగా టెక్నీషియన్‌కు ఫోన్ చేయాల్సిందే. వారు వచ్చే వరకు సమస్య అలాగే ఉంటుంది. అరదుకే అసలు రూటర్ ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ వాడే ప్రతి ఇంట్లో కనిపించే వస్తువు రూటర్. ఇది కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, మొబైల్స్, స్మార్ట్‌టీవీ ఇలా అన్ని డివైజ్‌లకు ఒక దాని నుంచి మరో దానికి నెట్వర్క్ సాయంతో డేటా పాకెట్లను ప్రసారం చేస్తూ ఉంటుంది. అది ప్రతి డివైజ్‌కు ఒక ప్రత్యేకమైన ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్‌ల ద్వారా పంపుతుంది. దేనికవే వేర్వేరుగా ఉంటాయి. ఇందుకు ప్రతి రూటర్‌లో ఒక డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రొటోకాల్ (డీహెచ్సీపీ) సర్వర్ సాఫ్ట్వేర్ పొందుపరచి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు రూటర్‌కు కనెక్ట్ అయి భిన్నమైన ఐపీ అడ్రస్‌లను డివైజ్‌కు కేటాయిస్తూ ఉంటుంది. దేనికి ఏ ఐపీ అడ్రస్ ఉండాలనే విషయానికి కూడా ఇందులో మ్యాక్ (మీడియా యాక్సెస్ కంట్రోల్) సిస్టమ్ ఉంటుంది. దీని ఆధారంగా ఏ డివైజ్‌కు ఏ ఐడీ ఉందనేది గుర్తుంచుకుంటుంది. పొరపాటున ఒక దానికి కేటాయించిన ఐపీ అడ్రస్ మరో డివైజ్‌కు కేటాయిస్తే వెంటనే స్క్రీన్ మీద ఐపీ అడ్రస్ కాన్ఫిలిక్ట్ అనే వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది. ఇలాంటి సందర్భాలలో రూటర్ రీస్టార్ట్ చేసేస్తే సమస్య పరిష్కారమవుతుంది.
తేడాలు : రూటర్, మోడమ్ అనే పదాలు వింటూనే ఉంటాం. రూటర్ ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు డేటాను ట్రాన్స్ఫర్ చేసేదైతే మోడెమ్ అందుకు భిన్నంగా పని చేస్తుంది. ఉపయోగించే సర్వీస్ ప్రొవైడర్ నుంచి అన్‌లాగ్ రూపంలో ఉండే సిగల్ స్వీకరించి దాన్ని డిజిటల్ రూపంలో రూటర్ ద్వారా కంప్యూటర్, ఇతర డివైజ్‌లకు అందించడమే మోడెమ్ పని. మోడెమ్ అంటే మాడ్యులేషన్ అండ్ డీమాడ్యులేషన్ అని అర్థం. కొన్ని చోట్ల మోడెమ్ లేకుంటే ఇంటర్నెట్ పనిచేయదు. వాడే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ని బట్టి ఇది ఆధార పడి ఉంటుంది. గతంలో మోడెమ్, రూటర్ విడివిడిగా కొనుగోలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఒకే డివైజ్‌లో ఉంటున్నాయి. అంటే ప్రస్తుతం వచ్చే మోడెమ్‌లు అన్నీ అంతర్గతంగా రూటర్‌ను కలిగి ఉంటున్నాయి.
అవసరమే : ఒకప్పుడు ఇంట్లో కేవలం కంప్యూటర్ మాత్రమే ఉండేది. వైఫై సదుపాయం ఉన్న మొబైల్ ఫోన్లు ఉండేవి కాదు. అసలు రూటర్ ప్రస్తావనే లేదు. ఇంటర్నెట్కు కేవలం మోడమ్ మాత్రమే ఉపయోగించేవారు. వైఫై వాడకం అందుబాటులోకి వచ్చాక మోడమ్తో పాటు రూటర్ కూడా అవసరం అయింది. ఇంటర్నెట్ కనెక్షన్ అన్ని డివైజ్‌లకు అందించడం పెరిగింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఆడియో, వీడియో ఫైళ్ళను రూటర్ ద్వారా టీవీకి స్ట్రీమింగ్ చేసుకునే వీలుంటుంది. అంతేకాదు రూటర్ కొనుగోలు చేయాలనుకున్నపుడు దాని రేంజ్, బ్యాండ్ విడ్త్, యాంటిన్నాల సంఖ్య, యూఎస్బీ కనెక్టివిటీ వంటి ఆప్షన్లను పరిగణలోకి తీసుకోవాలి.
యూఎస్బీ పోర్ట్ : రూటర్ తీసుకుంటే యూఎస్బీ పోర్ట్ ఉంటుంది. కొత్తగా వచ్చే వాటిలోనే కాదు, పాత వాటిలోనూ కొన్నింటిలో ఉన్నాయి. వీటికి పెన్‌డ్రైవ్, ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌లను కనెక్ట్ చేసి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్ వంటి వాటి నుంచి డేటాను యాక్సెస్ చేయవచ్చు. అయితే సెండర్స్, రిసీవర్స్ అందరూ ఒకే వైఫైకి కనెక్ట్ అయి ఉండాలి.
నెట్వర్క్ డ్రైవ్ : పర్సనల్ డేటా, సినిమాలు, ఇమేజ్‌లు, ఇతర డేటాను ఒక సెంట్రల్ స్టోరేజ్‌లో సేవ్ చేసి దానిని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఇది నెట్వర్క్ అసిస్టేడ్ స్టోరేజ్ డ్రైవ్స్ ఆధారంగా పని చేస్తుంది. డబ్ల్యూడీమై క్లౌడ్ సెగేట్ సెంట్రల్ స్టోరేజ్ ఆఫ్ వంటి డివైజ్‌లు 2టీబీ నుంచి 4టీబీ కెపాసిటీతో అందుబాటులో ఉన్నాయి. ఇవి తీసుకుని వైఫై రూటర్స్‌కు ఎథర్నెస్ గానీ యూఎస్బీ ద్వారా గానీ కనెక్ట్ చేస్తే ప్రపంచంలో ఎక్కడ నుంచైనా డేటాను యాక్సెస్ చేయవచ్చు. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ ఎన్ఏఎస్కు కనెక్ట్ అయిన వైఫై అప్లోడ్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే వైఫై అప్లోడ్ స్పీడ్ మీద ట్రాన్స్ఫర్ స్పీడ్‌గానే ఉంటుంది. వీటితో పాటు యాప్ అండ్ పీసీ సాఫ్ట్వేర్ కూడా వస్తుంది.
వైఫై ఆధారంగా : స్మార్ట్‌ఫోన్‌కు ఇన్ఫ్రారెడ్ సపోర్ట్ లేకపోయినా వైఫై ఆధారంగా యూనివర్సల్ రిమోట్ కంట్రోల్లా వాడుకోవచ్చు. కంట్రోల్ చేయాలనుకునే డివైజ్‌కు వైఫై ఉండాలి. రెండూ ఒకే వైఫై సపోర్ట్ చేయడానికి గూగుల్ ప్లేస్లోర్, యాపిల్ ప్లేస్టోర్లలో కొన్ని యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి. రిమోట్ కంట్రోలింగ్ కోసం ప్రస్తుతం కేవలం స్మార్ట్‌టీవీలకే వైఫై అందుబాటులో ఉంది. ఎథర్నెట్ పోర్ట్ గానీ వైఫై ఎనేబుల్డ్ ప్రింటర్ గానీ ఉండి ఉంటే వైఫై ప్రింటింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. డివైజ్లతో ప్రింట్ ఆప్షన్ ఎంచుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా అనేక రకాలుగా రూటర్ వివిధ అవసరాలకు ఉపయోగపడుతుంది.
Authorization