ఆండ్రాయిడ్ డెవలపర్స్ సంస్థ గూగుల్ ఈ ఏడాదిలో ఆండ్రాయిడ్ 11ను తీసుకువచ్చింది. ప్రతి ఏడాది ఆండ్రాయిడ్ వర్షెన్కు డెవలపర్ బిల్డ్‌లను మార్చిలో ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది మొదటి డెవలపర్ ప్రివ్యూను మాత్రం ఫిబ్రవరి మధ్యలోనే వెలువరిచింది. అసలు ఇందులో ఉండనున్న కొత్త ఫీచర్లు ఏంటి? పాత వాటికి దీనికి తేడా ఏంటి? మనం వాడే మొబైల్ మోడల్‌కు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం..
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్ప క్కర్లేదు. ప్రస్తుతం మనం వాడే అధునాతన పరికరాలు అందుకు ఆధారాలు. ఈ అభివృద్ధికి ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైన స్మార్ట్ఫోన్లు అతీతమేమీ కాదు. ఒక పక్క ఆయా కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌లో వర్షెన్లు తీసుకువస్తుంటే.. గూగుల్ కూడా ఏడాదికొక ఆండ్రాయిడ్ వర్షెన్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. గూగుల్ అందించే ఈ ఓఎస్‌లకు ఒకప్పుడైతే ఆల్ఫా, బీటా అని పేర్లు పెడుతూ వచ్చింది. ప్రస్తుతం వచ్చిన 11వ వర్షెన్కు మాత్రం అలాంటి పేరు పెట్టలేదు. గతేడాది వచ్చిన ఆండ్రాయిడ్ క్యూ కూడా పదవ వర్షెన్ మాత్రమే అని, ఎలాంటి పేరు పెట్టడం లేదని వెల్ల డించింది. అయితే ప్రస్తుతం వస్తున్న వర్షెన్‌లో కొత్త ఫీచర్లతో పాటు సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికారక సమాచారం. కొత్త ఫీచర్లతో పాటు రానున్న డెవలప్మెంట్ ఎప్పుడూ అనేది కూడా వెల్లడించింది. దీని కథా కమామిషీ ఏంటో ఓ సారి చూద్దాం.
కొత్తగా వస్తున్న ఫీచర్లు : ఇది ఫోల్డబుల్ ఫోన్లకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రకాల స్క్రీన్లకు సపోర్ట్ చేసేలా రూపొందిస్తున్నారు. కెమెరా సామర్థ్యాన్ని పెంచే సరికొత్త ఫీచర్లు, ప్రైవసీ సంబంధిత ఫీచర్లు, యాప్‌ల పనితీరును మరింత మెరుగుపరిచే ఫీచర్లు, 5జీ సంబంధిత ఫీచర్లు వంటి ఎన్నో ఈ ఆండ్రాయిడ్ 11లో అంది స్తున్నారు. సహజరగా ఫోన్ కొనేపుడు మొదట ప్రయారిటీ ఇచ్చేది కెమెరాకు, తర్వాత డిస్ప్లే, ఫీచర్లకు. వినియోగదారుల అభిరుచికి తగినట్లే ఇందులో కెమెరా వినియోగాన్ని మరింత సులభం చేశారు. అదేంటంటే ఫోన్ కెమెరాను ఉపయోగిస్తున్నప్పుడు రింగ్టోన్స్, వైబ్రేషన్స్ రాకుండా యాప్స్ ఏపీఐలను ఉపయోగించుకోనున్నాయి. బొకే మోడ్, నేటివ్ ఇమేజ్ డీకోడర్, ఇమేజ్ యానిమేషన్ల డీకోడ్, రెండర్ చేసే కెపాసిటీ కూడా ఇందులో అందుబాటులోకి వస్తోంది.
తర్వాతది డిస్ప్లే.. ఈ ఆండ్రాయిడ్ 11లో వాటర్ ఫాల్, పంచ్ హౌల్ వంటి స్క్రీన్లకు సపోర్ట్‌గా ఉండనుంది. ఇందులో వచ్చే మరో అద్భుతమైన ఫీచర్.. నోటిఫికేషన్ బార్ ద్వారానే ఫొటోలను కాపీ/పేస్ట్ చేయడం. వినియోగదారులు గూగుల్ క్రోమ్ నుంచి ఫొటోలను కాపీ చేసి జీబోర్డ్ ద్వారా పేస్ట్ చేయడం, వాటిని నేరుగా నోటిఫికేషన్ బార్ నుంచే సెండ్ చేసేయవచ్చు. అంతేకాదు ఆయా యాప్‌లను డెవలపర్లు ఆప్టిమైజ్ చేసే అవకాశం ఉంది. నోటి ఫికేషన్ల కింద ప్రత్యేకంగా కాన్వర్జేషన్ సెక్షన్‌ను అందిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా నోటిఫికేషన్ల కోసం బబుల్స్ ఏపీఐ అందుబాటులోకి రానుంది. ఇందులోని చాట్ బబుల్స్ ద్వారా వినియోగదారులు మల్టీ-టాస్కింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపించదు.
ప్రైవసీకి పెద్దపీట : ప్రస్తుత రోజుల్లో ప్రైవసీ సెక్యూరిటీ ఎంత ముఖ్యమైనదో చెప్పనవసరం లేదు. ఇందుకోసం ఆండ్రాయిడ్ 11 సరికొత్త వన్-టైమ్ పర్మిషన్ ఫీచర్‌ను పరిచయం చేస్తుంది. ఇది వినియోగదారుల లొకేషన్, మైక్ లేదా కెమెరాను యాక్సెస్ చేయడానికి యాప్స్‌కు తాత్కాలిక పర్మిషన్లను మాత్రమే అందిస్తుంది. గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం అందించే ఈ కొత్త ఫీచర్లు బయోమెట్రిక్స్ కంపాటబులిటీని మరింత ఎక్స్పాండ్ చేస్తుంది. ఏవైనా ధ్రువీకరణ పత్రాలను సురక్షితంగా ఉంచడం లోనూ, తిరిగి అందించడంలోనూ బాగా ఉపయోగపడుతుంది.
కనెక్టివిటీలోనూ మార్పులు : కాల్ స్క్రీనింగ్‌లో భారీ మార్పులు చేసింది. వైఫై ఏపీఐ, 5జీ సంబంధిత ఫీచర్లకు మరింత ఊతమిచ్చేలా దీన్ని రూపొందించారు. కనెక్షన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయడానికి వినియోగదారులే పరీక్షించుకునేలా కొత్త ఏపీఐని ఎటాచ్ చేస్తున్న ట్లు గూగుల్ పేర్కొంది. దీని వల్ల స్ట్రీమింగ్ కంటెంట్, రిజల్యూషన్ నాణ్యతలు కూడా బాగుంటాయి. అయితే ఇది ఎక్కువ డేటాను ఉప యోగిస్తుంది. అంతేకాదు కొత్త డెవలపర్ ఫేసింగ్లు పరిచయం కానున్నాయి.
వాటికి మాత్రమే : ఆండ్రాయిడ్ 11 ప్రస్తుతం కొన్ని పిక్సెల్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అవి పిక్సెల్ 4, పిక్సెల్ 3ఏ, పిక్సెల్ 3, పిక్సెల్ 2 స్మార్ట్ ఫోన్లు మాత్రమే. వీటి కోసం మొదటి ఆండ్రాయిడ్ 11 డెవలపర్ ప్రివ్యూకు సంబంధించిన సిస్టమ్ ఇమేజ్‌లతో పాటు జీఎస్ఐ ఫైళ్లు అందుబాటులో ఉన్నట్లు గూగుల్ వెల్లడించింది. ఇందులోనే బీటా టెస్టింగ్ కూడా అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతానికి సాధారణ ఫోన్లకు అందుబాటులో ఉండదు. బీటా టెస్టింగ్ పూర్తయ్యాక సాధారణ ఆండ్రాయిడ్ వినియోగదారులకు సైతం డెవలపర్ ప్రివ్యూలను అందిస్తారు. అయితే వీటన్నింటితో పాటు అందరూ ఎదరుచూసే డార్క్‌మోడ్ గురించి కూడా చర్చ ఉంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 10లో వచ్చినప్పటికీ కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఈ వర్షెన్‌లో దీని గురించి పెద్దగా సమాచారమేమీ లేకపోయినప్పటికీ ఉండే అవకాశం ఉంది కానీ అందరికీ ఉండకపోవచ్చు. మరింత సమయమూ పట్టే సూచనలున్నాయి.
విడుదల షెడ్యూల్స్ : డెవలపర్ ప్రివ్యూ 1 ఫిబ్రవరి, ప్రివ్యూ 2 మార్చి, ప్రివ్యూ 3 ఏప్రిల్, సాధారణ వినియోగదారులకు అవసరమైన బీటా వర్షెన్ 1 మే, బీటా 2 జూన్, బీటా 3 2020 జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉండనుంది. ఇక ఫైనల్‌గా వచ్చే బిల్డ్ కూడా అదే సమయంలో ఇంచుమించు కొంచెం తేడాతో రానుంది.
Authorization