ఆధునిక సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సాంకేతికతతోనే ఎన్నో పనులు సులభంగా పూర్తి
చేసుకునేలా వీలు కలుగుతోంది. ఎంత దూరాన్నైనా దగ్గర చేస్తోంది. ప్రపంచాన్నే చిన్నదిగా చేసింది. అయితే ఈ సాంకేతికతను మంచి కోసం ఉపయోగిస్తే మేలు చేస్తుంది. చెడు కోసం ఉపయోగిస్తే మాత్రం తిప్పలు తప్పవు. అలాంటి కోవలో చెప్పుకోదగినది స్పై కెమెరాల గురించే.. అవును.. ఈ కెమెరాలను ఉపయోగించినేరస్తులను పట్టుకునేందుకు ఎంత వీలుందో.. అంతే రీతిలో జీవితాలను బలి పెడుతోంది. అలాంటి స్పై కెమెరాలను ఏ విధంగా ఉపయోగించాలి..
ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు.. ఏ విధంగా అమరి ఉంటాయో తెలుసుకుందాం..కంటికి కనిపించనంత చిన్న చిన్న పరిమాణంలో స్పై కెమెరాలు ఉంటాయి. వీటిని పెన్నులు, షర్ట్ బటన్స్, చార్జర్ ఎడాప్టర్, టీవీలకు సంబంధించిన హౌల్స్లకు సులువుగా సరిపోతాయి. నేర పరిశోధనలో వీటి పాత్ర ఎంతో ఉంటుంది. కానీ ఆకతాయిలు మాత్రం వీటిని హౌటల్స్, రెస్టారెంట్స్, పబ్లిక్ ప్రదేశాలలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించగలిగే ప్రదేశాలు ఎన్ని ఉంటాయో అన్ని వెదికి వీటిని అమరుస్తున్నారు. ప్రస్తుతం వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనం.. స్పై కెమెరాలు నేరస్తులను, అక్ర మార్కులను పట్టుకునేందుకు ఉపయోగిం చడం మంచి విషయమైతే, ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసి వ్యక్తుల వ్యక్తిగత జీవి తాన్ని బహిర్గతం చేయడం చెడ్డ విషయం..
రకాలు : స్పై కెమెరా అంటే చూడడానికి సాధారణ కెమెరాలా కనిపించదు. వీటిని రకరకాల వస్తువుల రూపంలో అమర్చే వీలుంటుంది. పెన్, షర్ట్ బటన్, టేబుల్ మీద ఉండే చిన్న చిన్న క్లాక్‌లు, వాచ్‌లు, ఫొటో ఫ్రేమ్‌లు, మొక్కలు, కీ చైన్లు, స్విచ్ బోర్డులు, బల్బులు ఇలా ఎన్నో రకాలుగా అమర్చవచ్చు.
ఇంటర్నల్ సెన్సార్ : సాధారణ కెమెరాల వలే స్పై కెమెరాలలోనూ అంతర్గతంగా సెన్సార్ ఉంటుంది. అధిక శాతం స్పై కెమెరాలు నీళ్ళలోని దృశ్యాలను కూడా రికార్డు చేయగలిగేలా ఇన్ఫ్రారెడ్ కిరణాలను వెదజల్లగలు గుతాయి. నిరంతరాయంగా వీడియోలను రికార్డు చేయాలంటే మాత్రం విద్యుత్ సరఫరా ఉండాలి. బయటకు కనిపించకుండా వైర్ సాయంతో మరో చోట అమర్చిన డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)ని, కొన్ని కెమెరాలు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కెమెరాలను ఆకతాయిలు షోరూమ్‌లలోని ట్రయల్ రూంలలో ఏర్పాటు చేస్తుంటారు. డీవీఆర్ ఉపయోగించాలంటే విద్యుత్ సదుపాయం లేని సమయంలో బ్యాటరీ ద్వారా కూడా ఉపయోగించొచ్చు. ఇవి వీడియోలను మెమోరీ కార్డులో స్టోర్ చేస్తుంటాయి.
కదలిక, శబ్దం ద్వారా పని చేసేవి : బ్యాటరీ ద్వారా ఏర్పాటు చేసే స్పై కెమెరాలు కొన్ని వ్యక్తుల లేదా వస్తువుల కదలికల ద్వారా, శబ్ధాన్ని ఆధారం చేసుకుని పనిచేసేవి ఉంటాయి. అంటే.. ఉదాహరణకు ఒక ప్రదేశంలో స్పై కెమెరా ఏర్పాటు చేయాలంటే శబ్ధాన్ని బట్టి ఆ కెమెరా ఆన్ అయ్యే టెక్నాలజీ ఉపయోగిస్తారు. అలా వచ్చినపుడు మాత్రమే ఆ కెమెరా రికార్డు చేయడం మొదలు పెడుతుంది. కదలికలను రికార్డు చేసే కెమెరాలూ ఇలాగే పని చేస్తాయి. వీటిల్లో కెమెరాలు ఆన్‌లో ఉన్నప్పటికీ రికార్డు అయ్యేది మాత్రం ఆయా సందర్భాలలో మాత్రమే. ఆ వీడియోలు మాత్రమే మెమోరీ కార్డులో సేవ్ అవుతుంటాయి. మొబైల్స్‌ను కూడా స్పై కెమెరాలుగా ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాక్ కెమెరాలు దగ్గర స్పై కెమెరాలను ఎవరికీ అర్థం కాకుండా ఆపరేట్ చేయవచ్చు. కనీసం ప్రివ్యూ కూడా కనిపించకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో రికార్డ్ అయ్యే యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
జాగ్రత్త అవసరం : స్పై కెమెరాల ద్వారా నగ దృశ్యాలు రికార్డు చేసి, పోర్న్ సైట్లో అప్లోడ్ చేస్తున్న ఘటనలు ఎక్కువగా వింటున్నాం. మరి కొంత మంది ఆ వీడియోలను సంబంధిత మహిళకు పంపి బ్లాక్మెయిల్ చేయడం, వారి నుంచి డబ్బులు డిమాండ్ చేయడం తరచూ వార్తలలో వస్తూనే ఉన్నాయి. ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.. అందుకు సంబంధిం చిన ఆధారాలు వీడియో తీసి పోలీసులకు అప్పగించాలి.
ఇలా గుర్తించొచ్చు : స్పై కెమెరాలను గుర్తించేందుకు అనేక రకాల పద్ధతులున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ప్లేస్టోర్‌లో స్పై, హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి. యాపిల్ వినియోగ దారులకు ఈ యాప్ బాగా పని చేస్తుంది. ఎక్కడైనా హిడెన్ కెమెరా ఉందని అనుమానం వస్తే ఆ రూమ్‌ని చీకటిగా ఉంచి, అనుమా నమున్న ప్రదేశంలో పరిశీలిస్తే తెలిసి పోతుంది. ఇలాంటి వాటిని గుర్తిం చేందుకు బగ్స్ బాగా పని చేస్తాయి. కొన్ని రకాల కెమెరా లున్న ప్రదేశంలో ఫోన్ కాల్ ట్రై చేస్తే కాల్ డ్రాప్ అవుతుంది. ఇందుకు కారణం వాటిల్లో ఉండే మాగటిక్ తరంగాలు. అయితే ఈ మధ్య కాలంలో నెట్వర్క్ సమస్య ఎక్కువగా ఉండడం తో ఫోన్ కాల్ కట్ అవడానికి స్పై కెమెరానే ఉందని అనుమానించలేని పరిస్థితి. షాపింగ్ మాల్స్ విషయానికి వస్తే.. అద్దాలు రెండు రకాలుంటాయి. ట్రయల్ రూంలో అద్దం సహజరగా ఒకవైపు మన రూపాన్ని చూపించడానికి దాని వెనుక భాగం వేరే రంగుతో కోటింగ్ వేయబడి ఉంటుంది. కానీ కొన్ని అద్దాలు పారదర్శకంగా ఉండి ఇవతలి దృశ్యాలను అవతలికి చూపిస్తుంటాయి. అద్దాలకు కొద్దిగా ఖాళీ స్థలం ఉండాలి. అలా కాకుండా రెండు టచ్ అయినట్లు ఉంటే మాత్రం దృశ్యాలు అవతలి వైపు కనిపిస్తుంటాయి. ఇలాంటివి మరీ నిశితంగా పరిశీలించాలంటే.. లైట్ ఆఫ్ చేసి టార్చ్ లైట్ వేసి చూస్తే.. ఆ ఫ్లాష్ అద్దం అవతలి వైపు ఏదైనా ఉండేమో చూపిస్తుంది. అందుకే మహిళలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
Authorization