*క్లిష్టత లేని రిమోట్ భాగస్వామ్యపు భవిష్యత్‌ను వేగవంతం చేసేందుకు ఆల్ ఇన్ వర్క్ టూల్‌ను పరిచయం చేసిన లార్క్ టెక్నాలజీస్
*అపరిమిత యూజర్ల కోసం వీడియో మీటింగ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్‌ను సైతం లార్క్ అందిస్తుంది
*తరగతి గదికి వెలుపల విద్యార్థులు మరియు విద్యావేత్తలు తమ అభ్యాసాన్ని కొనసాగించేందుకు వీలు కల్పిస్తుంది
సింగపూర్ కేంద్రంగా కలిగిన టెక్నాలజీ కంపెనీ లార్క్ టెక్నాలజీస్ పీటీఈ లిమిటెడ్ నేడు తమ డిజిటల్ భాగస్వామ్య సూట్, లార్క్ను భారతదేశంలో ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది. భాగస్వామ్యం కోసం సంపూర్ణమైన వేదిక లార్క్, మెస్సెంజర్, ఆల్‌లైన్ డాక్యుమెంట్లు మరియు షీట్లు, క్లౌడ్ స్టోరేజీ, క్యాలెండర్, వీడియో కాన్ఫరెన్సింగ్ సహా అనేక ముఖ్యమైన వర్క్ టూల్స్‌ను కలిపి తీసుకువస్తుంది.
అంతర్జాతీయంగా వ్యాపారాలన్నీ కూడా కోవిడ్‌ఉ19 మహమ్మారి కారణంగా ప్రభావితమవుతున్నాయి. ప్రయాణాలపై నియంత్రణలు కొనసాగుతుండటంతో పాటుగా తప్పనిసరిగా ఇంటి నుంచి పనిచేయడం, రిమోట్ అభ్యాస ప్రక్రియలు వంటివి చోటుచేసుకుంటున్నాయి. లార్క్ ఈ ఖాళీని విస్తృతమైన, అతి సులభంగా వినియోగించతగిన సహకార ఉపకరణంగా పూరిస్తుంది. ఇది ప్రజలు అనుసంధానించబడటంలో సహాయపడుతుంది.
ఈ సేవలను భారతదేశ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ తరగతుల సహా విద్యాసంస్థలకు సైతం ఉచితంగా అందించడం చేయనున్నారు. ఇది ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నడుమ రిమోట్ వర్కింగ్‌ను సాధ్యం చేస్తుంది. ఇది ప్రభావవంతంగా మరియు వేగంగా వర్క్‌ఫ్లోను నిర్వహిస్తుంది.
ఈ సహకార నెట్‌వర్క్‌కు ఆవల, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులు అభ్యాసాన్ని అందించేందుకు, పాఠశాలలను మూసి వేసిన సమయంలో సామాజిక సంభాషణలను అందించే ఓ వేదికగా లార్క్ను యునెస్కో గుర్తించింది.
ాారిమోట్ వర్కింగ్‌ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల, ప్రభావవంతమైన సమాచారం మరియు సహకారం అవసరం ఉందని మేము నమ్ముతున్నాము. వ్యాపార సంస్థలు మరియు విద్యాసంస్థలు సుదూర అభ్యాసంతో పాటు పనిలో కొనసాగింపును నిర్థారించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. డిజిటల్ సహకార ఉపకరణాల ద్వారా మేము ప్రాప్యతను అందించడానికి కట్టుబడి ఉన్నాము మరియు లార్క్ను పూర్తి ఉచితంగా అందించనున్నాం. ఇది పరిమాణంతో సంబంధం లేకుండా , ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా పలు సంస్థలు ప్రభావవంతంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు తోడ్పడుతుంది్ణ్ణ అని వినయ్ భార్టియా, లార్క్ హెడ్, ఇండియా అన్నారు.
లార్క్ వద్ద, మేము సంస్థలు, వ్యక్తులు మరింతగా సాధించేందుకు మరియు మరింత సమర్థత, ఆనందాన్ని పొందేందుకు తోడ్పడటానికి తీవ్రంగా కృషి చేస్తుంటాం. మా అంతర్గతంగా నిర్మితమైన ఫీచర్లు, బహుళ జాతి బృందాలు ఏకతాటిపైకి వచ్చి ఓ వ్యక్తిలా పనిచేసేందుకు తోడ్పడతాయి. ప్రభావవంతమైన సమాచారం అనే సంస్కృతిని మేము నిర్మిస్తున్నా
లార్క్ యొక్కఉచిత వెర్షన్ అపరిమిత వీడియోకాల్స్ (అత్యాధునిక స్ర్కీన్ షేరింగ్‌తో), 200జీబీ క్లౌడ్ స్టోరేజీ, ఆన్లైన్ సహకార డాక్స్ మరియు షీట్స్ , స్మార్ట్ క్యాలెండర్, శక్తివంతమైన మెస్సెంజర్, అపరిమిత థర్డ్ పార్టీ యాప్ ఇంటిగ్రేషన్స్, అనుకూలీకరించబడిన హాజరు/ ఆమోదం పొందిన వర్క్ఫ్లోస్తో వస్తుంది. ఈ ఫీచర్లు అన్నీ కూడా సింక్రనైజ్ చేయబడ్డాయి. అందువల్ల, పని పూర్తి చేయడానికి అప్లికేషన్ల నడుమ మారుతూ ఉండాల్సిన అవసరం లేదు. అంటే దీనర్థం, లార్క్ వినూత్నమైన ఫీచర్లు అయినటువంటి చాట్ లోపలనే టీమ్ సభ్యుల షెడ్యూల్స్‌ను పరిశీలించడం, క్యాలెండర్ ఈవెంట్ నుంచి వీడియో కాల్‌ను చేయడం, వీడియో కాల్స్లోపలే ఓ డాక్యుమెంట్‌ను సంయుక్తంగా ఎడిట్ చేయడం వంటివి సైతం అందిస్తుంది.
అదనంగా, వర్ట్యువల్ సహకారం యొక్క మరిన్ని సంభావ్యతలను సాధ్యం చేసేందుకు లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్‌ను సైతం లార్క్ ఆవిష్కరించింది. లక్షలాది మంది ప్రజలకు చేరువకావడానికి వీడియో సమావేశాలను లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు. ఇది భారీ సమావేశాలు అయినటువంటి పరిస్థితులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులను ఉద్దేశించి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉపన్యాసాలు ఇవ్వడం లేదా ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఎక్కడో ఒక చోట నుంచి బోధన చేయడం వంటి వేళ ఉపయుక్తంగా ఉంటుంది.
అన్ని బృందాలకూ ఒకే సూట్
వారెక్కడ ఉన్నారన్న అంశంతో సంబంధం లేకుండా ఆర్గనైజేషన్లు అనుసంధానించబడి ఉండేందుకు లార్క్ సహాయపడుతుంది. లార్క్ యొక్క కొన్ని ప్రధానమైన ఫీచర్లను ఈ దిగువన ఇవ్వడం జరిగిందిః
మెస్సెంజర్
లార్క్ యొక్క శక్తివంతమైన మెస్సెంజర్తో, మీరు 5వేల మంది సభ్యుల వరకూ చాట్ గ్రూప్‌లను సృష్టించవచ్చు. అన్ని రకాల స్టాఫ్ ప్రకటనలనూ చేయవచ్చు మరియు శబ్దాలను కనిష్టంగానూ చేయవచ్చు. ఎమోజీ రిప్లయ్స్, థ్రెడెడ్ కన్వరేషన్స్ మరియు రిసిప్ట్ చదవడం వంటి ఫీచర్ల కారణంగా బృంద సభ్యులు తమ వర్క్‌కు సంబంధించి తక్షణ ఫీడ్‌బ్యాక్‌ను సైతం తెలుసుకోవడం సాధ్యమవుతుంది మరియు వారెక్కడ ఉన్నా సమకాలీకరించడమూ వీలవుతుంది. యూజర్లు తమంతట తాము వీడియో/ఆడియో కాల్స్ చేయడం, గ్రూప్ సభ్యుల షెడ్యూల్స్ పరిశీలించడం, డాక్యుమెంట్లను పంపడం వన్నీ కూడా మెస్సెంజర్ను వదలకుండానే చేయవచ్చు. చాట్ చరిత్ర మొత్తం శోధించతగినది మరియు సమాచారాన్ని గుర్తించడం సులభం.
వీడియో కాన్ఫరెన్సింగ్:
లార్క్పై 100మందికి పైగా అభ్యర్థులు ఆధారపడతగిన వీడియో కాల్స్‌ను అపరిమిత నిమిషాల పాటు మృదువుగా చేసుకోవచ్చు. వారి స్ర్కీన్ షేర్ చేసుకోవడం లేదా లార్క్ డాక్ (డెస్క్‌టాప్ లేదా మొబైల్ నుంచి) పంచుకోవడం మరియు లార్క్ డాక్‌ను సంయుక్తంగా కోఉఎడిట్ చేయడం వంటివి వీడియో కాల్‌లోనే చేయవచ్చు. ఏదైనా చాట్ లేదా క్యాలెండర్ ఈవెంట్ నుంచి ఒక్క క్లిక్‌లో వీడియో కాల్‌ను చేయవచ్చు మరియు ఏ డివైజ్ పై నుంచి అయినా యూజర్లు దీనిపై చేరవచ్చు. బాహ్య అభ్యర్థులను సైతం ఆహ్వానించేందుకు లార్క్ వీడియో కాన్ఫరెన్సింగ్ మద్దతునందిస్తుంది.
క్యాలెండర్
లార్క్ యొక్క క్యాలెండర్ ఫంక్షన్ ద్వారా బహుళ క్యాలెండర్లను యూజర్లు ప్రదర్శించేందుకు అనుమతిస్తుంది మరియు తమ బృంద సహచరుల షెడ్యూల్స్ అన్నీ కూడా ఒకేసారి పరిశీలించేందుకు తోడ్పడుతుంది. అదనంగా, వ్యక్తిగత కాంటాక్ట్స్‌ను మీటింగ్‌కు ఆహ్వానించడంతో పాటుగా తమ గెస్ట్ జాబితాకు గ్రూప్ పేర్లను జోడించడం ద్వారా మొత్తం చాట్ గ్రూప్స్‌ను సైతం యూజర్లు ఆహ్వానించవచ్చు. ఏదైనా క్యాలెండర్ ఈవెంట్ నుంచి, యూజర్లు ఓ చాట్ గ్రూప్‌ను ఆరంభించవచ్చు (లార్క్ మెస్సంజర్లో) మరియు ఎజెండా డాక్ (లార్క్ డాక్స్‌లో) ఒక్క క్లిక్‌లో ప్రారంభించవచ్చు. అందువల్ల, సంభాషణను మీటింగ్ ప్రారంభం కాకమునుపే ప్రారంభించవచ్చు మరియు ప్రతి ఒక్కరూ అదే పేజీపై ఉండవచ్చు.
డాక్స్
లార్క్ డాక్స్‌పై, యూజర్లు తమ టీమ్ సహచరులతో కలిసి ఆన్లైన్ డాక్యుమెంట్లను వీడియో కాల్స్ సమయంలో సైతం కోఉఎడిట్ చేయవచ్చు మరియు మార్పులన్నింటినీ లార్క్ డ్రైవ్‌లోని క్లౌడ్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు (లార్క్ యొక్క ఫ్రీ వెర్షన్లో 200జీబీ క్లౌడ్ స్టోరేజీ జోడించబడింది). లార్క్ డాక్స్‌లో భారీ మల్టీ మీడియా కంటెంట్ అయినటువంటి చిత్రాలు, వీడియోలు, చార్ట్స్, ఆఖరకు గ్రూప్ చాట్స్, పోల్స్‌ను సైతం జోడించవచ్చు. కామెంట్ ఫీచర్ వినియోగించి, యూజర్లు లార్క్ డాక్స్ యొక్క నిర్థిష్టమైన డాక్స్ లేదా లార్క్ షీట్లో నిర్థిష్టమైన సెల్స్‌ను సైతం వినియోగించవచ్చు. లార్క్ డాక్స్‌పై, మీరు అత్యంత సులభంగా డాక్యుమెంట్ షేరింగ్ అనుమతులను వీక్షించడం మరియు నిర్వహించడంతో పాటుగా సమాచారాన్ని సురక్షితంగానూ ఉంచుకోవచ్చు.
వర్క్‌ప్లేస్
లార్క్ వర్క్‌ప్లేస్‌పై, యూజర్లు తమ సంస్థ యొక్క అంతర్గత వర్క్‌ఫ్లో అయినటువంటి అనుమతులు, రీఇంబర్స్మెంట్స్, సెలవులు, హాజరు వంటి వాటిని సైతం ఎలాంటి కోడింగ్ లేదంటే అదనపు సాఫ్ట్వేర్ కొనుగోలు చేచకుండా ఆటోమేట్ చేయడం మరియు అనుకూలీకరించడం చేయవచ్చు. జిరా నుంచి ఆసానా నుంచి సేల్స్‌ఫోర్స్ వరకూ థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌తో లార్క్ను వారు సమ్మిళితం చేయవచ్చు. ఓపెన్ ప్లాట్‌ఫామ్ కావడం చేత లార్క్ యూజర్లు తమ సొంత యాప్స్, బాట్స్‌ను సైతం నిర్మించవచ్చు.