రక్తనాళాల్లోని రక్తం వాటి గోడలపై చూపించే ఒత్తిడిని రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ (బీపీ) అంటారు. ఇది ఒకసారి వచ్చిందంటే నయం కాదు. అయితే.. జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే దీన్ని నియంత్రించొచ్చు. చిన్న చిన్న మార్పుల ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. - ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. రోజుకు 5 గ్రాములకంటే మించి ఉప్పు వాడకూడదు. - ఫాస్ట్పుడ్స్ తినడం బాగా తగ్గించాలి. వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. సోడియం క్లోరైడ్ బీపీని పెంచుతుంది. - కొవ్వు పదార్థాల వల్ల కొలెస్ట్రాల్ పెరిగి బీపీకి కారణమవుతుంది. - బీపీ ఉన్న వారు నూనె పదార్థాలు తక్కువ తీసుకోవాలి. నూనెలు ద్రవరూపంలో ఉన్న కొవ్వులు. వీటి వాడకం తగ్గించడం ఎంతో అవసరం. - పచ్చళ్లలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీపీ ఉన్నవారు వాటిని బాగా తగ్గించాలి. - బీపీ ఉన్నవారు ఎక్కువ పీచు పదార ్థం ఉండే ఆహారం తీసుకోవాలి. - పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పప్పులు తినాలి. - ఆల్కహాల్ని మానేయాలి. ఇందులో ఉండే ఎక్కువ కేలరీలు శరీరంలో కొవ్వును పెంచుతాయి. - పొగ తాగడం మానేయాలి. సిగరెట్లలోని నికొటిన్ రక్తనాళాలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. - తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. - బీపీ ఉన్నవారు కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో రక్తపోటును నివారించే పొటాషియం ఎక్కువగా ఉంటుంది.