ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతే ప్రమాదమనే విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా మన రక్తంలో లక్ష 50 వేల నుంచి 4 లక్షల 50 వేల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. ఏదైనా గాయం వల్ల బయటకు వచ్చిన రక్తం గడ్డ కట్టడానికి ఇవి దోహదపడతాయి. గాయం తొందరగా మానడానికి కూడా తోడ్పడతాయి. శరీరంలోని అన్ని రుగ్మతలను రూపుమాపడానికీ ఇవి సమర్థంగా పనిచేస్తాయి. వీటి సంఖ్య తగ్గినప్పుడు తీవ్రంగా జ్వరం, బీపీ, గుండెపోటు, నీరసం వస్తాయి. ఈ సమస్యల బారిన పడకుండా ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి. మనం తీసుకునే ఆహారంపైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుందనేది గుర్తించాలి. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. - ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచడంలో బీట్రూట్ పాత్ర కీలకం. రక్త హీనత (ఎనీమియా)తో బాధపడే వారు తప్పకుండా బీట్రూట్ తీసుకోవాలి. - వారంలో కనీసం రెండుసార్లయినా క్యారెట్ తీసుకోవాలి. - బ్లడ్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పుడు బొప్పాయి తీసుకోవడం మంచిది. - నేచురల్‌గా ప్లేట్లెట్స్ పెంచుకోవాలంటే వెల్లుల్లి మంచి ఔషధం. వంటల్లో దీన్ని విరివిగా వాడాలి. - శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో విటమిన్-కే పుష్కలంగా ఉంటుంది. - దానిమ్మలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి ఇది దోహదపడుతుంది. - అప్రికాట్ తినడం వల్ల కూడా ప్లేట్లెట్స్ లెవల్ పెరుగుతుంది. - ఎండు ద్రాక్ష (కిస్మిస్)లో 30 శాతం ఐరన్ ఉంటుంది. ఇవి గుప్పెడు తీసుకుంటే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. - ఎండు ఖర్జూరలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ప్లేట్లె వృద్ధికి ఇవి మెరుగుపరుస్తాయి.