'పెండ్లెప్పుడు?' అనడిగితే.. 'నాకు అప్పుడే పెండ్లే మిటి?' అంటారు చాలామంది యువకులు. ' సెటిల్ అయ్యాకే మ్యారేజ్ ' అనేస్తారు. పెండ్లికి తొందరపడకుండా జీవితంలో స్థిరపడటానికి ప్రాధాన్యమిస్తారు. ఇది మంచిదే. అంతేకాదు.. ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలని అంటున్నారు పరిశోధకులు. పాతికేండ్ల వయసు నిండక ముందు పెండ్లి చేసుకుంటే ఎముకల సంబంధ వ్యాధుల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. అరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చేసిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. .