ఎండాకాలం చాల రకాల సమస్యలను తెచ్చిపెడ్తుంది. ముఖ్యంగా చర్మసమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖం జిడ్డుగా మారి చికాకు తెప్పిస్తుంది. డ్రై, ఆయిల్ స్కిన్ వారే కాదు నార్మల్ స్కిన్ వారు సైతం ఎండాకాలం స్కిన్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలతో చర్మాన్ని ఎండబారి నుంచి కాపాడుకోవచ్చు.. - వీలైనంత వరకు సూర్యరశ్మికి దూరంగా ఉండండి. ప్రత్యేకంగా మిట్ట మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో వెండలో బయటకు వెళ్ళకండి. ఒక వేల వెళ్ళాల్సివస్తే తల, మొహం ఏదైనా కాటన్ చ్లొథ్ తో కవర్ చేసుక్వడం మర్చిపోవద్దు. సూర్య రశ్మి లో ఉండే ఖVకిరణాలు చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అంతే కాకుండా చర్మకాన్సర్ కు కూడా కారణం అవుతాయి. - సూర్య కిరణాలలో ఉండే ఆల్ట్రా వయొలెట్ కిరణాలు సున్నితమైన చర్మానికి చాల హాని కారకాలు. ఇవి చర్మంలోని తాజాదనం, రంగు కోల్పోయేలా చేస్తాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. ఆల్ట్రా వయొలెట్ కిరణాలు సూర్య కాంతి లోనే కాదు మాములు వాతావరణంలో కూడా ఉంటాయి. ఎండలోకి వెళ్లినప్పుడు కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వీటిని వాడాలి. - హెవీ మాయిచ్చారైజర్లు ఎండాకాలంలో చర్మలోని స్వేద రంద్రాలను ముసివేయడానికి అవకాశాలు న్నాయి. వీటివల్ల అనేక రకాలైన ఇబ్బందులు రావడమే కాకుండా, చర్మం పొడిబారి పోతుంది. అందుకే ఎండాకాలంలో హెవీ కాని మాయిచ్చారైజర్ లు, ఫౌండేషన్లు మాత్రమే ఉపయోగించాలి. - వాతావరణంలో తేమ తగ్గడంతో చర్మం సులభంగా పొడి బారుతుంది. పొడి బారిన చర్మం సహజ మెరుపును కోల్పోవడమే కాకుండా ముడుతలు పడడానికి కూడా దారి తీస్తుంది. దీంతో చర్మం వయసు పై బడినట్టు కనపడుతుంది. దీన్ని నివారించాలంటే ముఖాన్ని ఎక్కువ సార్లు కడగక పోవడం మంచిది. అలసట అనిపించిన ప్రతిసారి చల్లని నీటితో తడిపిన కాటన్ క్లాత్‌తో ముఖం తుడుచుకోవాలి. - ఎండా కాలంలో ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. ఎంత ఎక్కువగా మంచి నీళ్ళు తాగితే అంత ఆరోగ్యం. అంతే కాదు, చర్మ సౌందర్యం కూడా. ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరం లోని మలినాలు సులభంగా బయటకు వెళ్తాయి. డీ హైడ్రేషన్ అవకుండా చూసుకోవడం వలన చర్మం పొడి బారకుండ కూడా ఉంటుంది. ఎండా కాలంలో ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడం చర్మానికే కాదు ఆరోగ్యానికి ఎంతో అవసరం.