గొంతులో సమస్య వస్తే నోటి నుంచి మాట సరిగ్గా రాదు. మాట్లాడే సమయంలోనూ.. నిద్రలోనూ గొంతులో గరగర అనిపిస్తుంది. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువగా సీజన్ మారే సమయంలో వస్తుంది. అన్ని వయసుల వారిలోనూ గొంతు లో గరగర సమస్య వస్తుంది. ఈ సమస్యకు ముఖ్యకారణం జలుబు, ఫ్లూ, తలనొప్పి, సైన సైటీస్ నొప్పి, దగ్గు వంటి అనారోగ్య సమ స్యలు. గొంతు సమస్య కారణంగా చాలా ఇబ్బం దులు వస్తాయి. ఆహరం తినే సమయంలోనే కాదు..నీళ్లు మింగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. గొంతు భాగంలో నొప్పిగా అనిపించి ఆహారం తీసుకోవడం తగ్గించేస్తారు. దీంతో నీరసం వస్తుంది. గొంతులో వచ్చే సమస్యలకు సహజ ఔషదాల ద్వారా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో పాటించే చిన్నచిన్న చిట్కాలతో గొంతునొప్పి, గొంతులో గరగరల నుంచి తప్పించుకోవచ్చు.
ఉప్పునీరు..
సాధారణంగా వచ్చే గొంతు నొప్పిని ఉప్పునీరు దివ్యంగా పనిచేస్తుంది. ఒకగ్లాసు గోరువెచ్చని నీటిలో అరటీ స్పూన్ ఉప్పు వేసి ఆ నీటితో రెండుమూడుసార్లు బాగా పుకిలించాలి. ఈ నీటిలో పావు స్పూన్ అల్లంరసం కలిపితే మరింత త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఇది గొంతులో ఏర్పడే గరగర, నొప్పి సమస్యలను తగ్గించే అత్యుత్తమ విధానం.
ఆవిరి పట్టడం..
ఎండాకాలంలో దాహార్తిని తట్టుకోలేక చాలామంది చల్లటినీరు, డ్రింగ్స్ ఎక్కువగా తీసుకుంటారు. అప్పుడే గొంతులో సమస్య ప్రారంభం అవు తుంది.గొంతులో నొప్పి అనిపించగానే.. చల్లటి ద్రావణాలను తాగటం ఆపేసి, గోరు వెచ్చని నీటిని తాగటం ప్రారంభించండి.విజిటబుల్ సూప్స్, శొంఠిమిరియాల కషాయం వంటివి తాగటం వలన గొంతులో వచ్చిన సమస్యను చాలావరకు తగ్గిస్తాయి. అంతేకాదు గొంతు నొప్పి ఎక్కువగా జలుబులోనే వస్తుంది. ఆవిరిపట్టడం ద్వారా చాలావరకు సమస్య తగ్గుతుంది.
ఒక పెద్ద గిన్నెలో నీటిని బాగా వేడి చేయాలి. ఇందు లో ఒకస్పూన్ పసుపు వేసి నిండా దుప్పటి కప్పుకోవాలి. బయట గాలి లోపలి రాకుండా, లోపలి ఆవిరులు భయటకు రాకుండా చుట్టూ దుప్పటి కప్పుకోవాలి. వేడినీటి నుంచి వచ్చే ఆవిరిని ముక్కు ద్వారా పీల్చాలి. వేడి ఆవిరు లను పీల్చటం మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా..త్వరగా ఉపశమనం లభిస్తుంది.
తేనె, నిమ్మరసం
గొంతులో కలిగే చికాకులు, సమస్యలను తగ్గించే ఔషధగుణాలు తేనె, నిమ్మరసంలో ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో అందుబాటులో ఉండే వీటిలో తయారుచేసే రుచికరమైన పానీయం గొంత సమస్యలకు చెక్ పెడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరస్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పొద్దున, సాయంత్రం తాగితే త్వరగా గొంతు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, ఫ్లూ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
Authorization