- చాలామంది తరచుగా జలుబు, జ్వరం ఇలా ఏదో ఒక ఇన్ఫెక్షన్బారిన పడుతుంటారు. ఇందుకు కారణం వారిలో ఇమ్యూనిటీ లేదా వ్యాధి నిరోధక శక్తి తగ్గడమే. పుట్టుకతోనే వచ్చే ఇమ్యూనిటీని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. - వాతావరణ కాలుష్యం బారిన పడకుండా సాధ్యమైనంతవరకు జాగ్రత్తపడాలి. - తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటే యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల ఫ్రీ రాడికల్స్ తగ్గిపోయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. - కాల్షియం లోపిస్తే ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, కోడిగుడ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. - ఇమ్యూనిటీ తగ్గకుండా ఉండాలంటే తగినంత శారీరక శ్రమ అవసరం. కాబట్టి రోజూ వ్యాయామం చేయాలి. - అధిక ఒత్తిడికి లోనవద్దు. ఒత్తిడి తగ్గించుకునేందుకు బ్రీతింగ్ ఎక్సర్సైజులు, ప్రాణాయామం సహకరిస్తాయి. ప్రాణాయామం వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ చురుకుదనం కూడా పెరుగుతుంది. - గర్భిణిగా ఉన్నప్పుడు తగినన్ని పోషకాలు తీసుకోకపోయినా, ఇన్ఫెక్షన్లు వచ్చినా పుట్టే బిడ్డకు వ్యాధినిరోధకతలో లోపం ఏర్పడవచ్చు. కాబట్టి గర్భిణిగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. - పొగతాగడం, ఆల్కహాల్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.