రోజురోజుకు పెరుగుతున్న అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి వెళ్లేవారి సంఖ్య అధికమవు తుంది. వైద్యచికిత్స కోసమే కాకుండా వైద్యపరీక్షల కోసం, ఫిజియో థెరపీ వంటి వాటికోసం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. అయితే చిన్నచిన్న కుంటుంబాల్లో, భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులే ఉన్న ఇండ్లల్లో పెద్దవారికి వైద్యసేవలు అందించడం కష్టమే. అందుకే ఇటీవల మందుల హౌమ్ డెలీవరీ, ఫిజియోథెరపీ, రక్త, మూత్ర పరీక్షలు వంటి వైద్యసేవలు ఇంటి వద్దనే లభిస్తున్నా యి. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. తాజాగా కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ యాజమాన్యం 'కేర్ ఎట్ హౌమ్'పేరుతో వైద్యసేవలు అవసరమైన వారి ఇంట్లోకే ఐసీయూ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని సార్లు సర్జరీ తర్వాత ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చిన రోగులతో పాటు దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతూ రోజుల తరబడి ఐసీయూలో ఉండాల్సి వచ్చే కేన్సర్, పక్షవాతం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, న్యుమోనియా, ఆస్తమా సంబంధిత రోగులకు వారి బంధువుల సమక్షంలో ఇంటివద్దనే వారికి ఆహ్లాదకరమైన వాతావరణం లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. దీనివల్ల ఆసుపత్రి ఖర్చులు తగ్గడంతో పాటు జబ్బుపడిన మనిషి ఇంటివాతావరణంలో ఉంటూ.. త్వరగా కోలుకునే అవకాశమూ ఉంది.
చాలా మందికి సర్జరీ తర్వాత అత్యవసరమైతే తప్ప ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉండదు. చిన్నచిన్న వాటి కోసం రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి రావడం వల్ల రోగులు హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్కు గురవుతుంటారు. నాలుగు రోజుల్లో కోలు కోవాల్సిన రోగి పది రోజులైనా ఆరోగ్యం మెరుగుపడదు. ఆస్పత్రి ఖర్చులు కూడా తడిసి మోపెడవుతుంటాయి. సర్జరీ తర్వాత కేవలం ఇంజక్షన్లు, డ్రెస్సింగ్, ఫిజియో థెరపీ కోసం రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చే రోగులకు హౌమ్ కేర్ సర్వీసులు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
కేన్సర్, పక్షవాతం సహా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి రోగాల బారిన పడ్డవారికి ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో వైద్యసేవలు అందించాల్సి వస్తుంది. రోగిని రోజుల తరబడి ఐసీయూలో ఉంచాల్సి వస్తుండటం, ఈ వైద్య ఖర్చులు భారంగా మారుతున్నాయి. ఐసీయూలో రకరకాల బాధితులు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఒక రోగి ఇన్ఫెక్షన్ మరో రోగికి సోకుతుండటం వల్ల దాన్ని నియంత్రించ డానికి అనివార్యంగానే యాంటి బయాటిక్ మందుల్ని ఎక్కువ మోతాదులో వాడాల్సి వస్తుంది. దీంతో రోగి కోలుకోక పోగా ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అదే సర్జరీ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, ఇంట్లోని బంధువుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యసేవలు అందించడం వల్ల రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
రోజుల తరబడి ఐసీయూ చికిత్సలు అవసరమైన రోగులకు ఇంట్లో ఆస్పత్రి ఐసీయూకు కావాల్సిన వాతావరణం ఉన్నట్లు నిర్ధారించుకుని గాలి, వెలుతురు ఉన్న ప్రదేశాన్ని ఇందుకు ఎంపిక చేస్తారు. రోగి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కావాల్సిన వెంటిలేటర్, ఆక్సిజన్, సీపీఏపీఎస్, బైలెవల్ ప్యాప్, సక్షన్ అండ్ ఎయిర్ ఫర్ ఫియర్, మల్టీపారా మానిటర్, బ్యాక్రెస్ట్ కాట్, ఐసీయూ బెడ్-3,5 ఫంక్షన్ మోటరైజ్డ్, తదితర మెడికల్ ఎక్విప్మెంట్స్తో పాటు ఎప్పటికప్పుడు రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఒక డాక్టరు, సీనియర్ నర్సు, ఫిజియో థెరపిస్ట్, అటెండర్ను ఇంటికి వస్తారు. మందులతో పాటు సాధారణ వైద్య పరీక్షలు సైతం ఇంటి నుంచే అందిస్తారు. ఒక వేళ రోగి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లయితే రోగికి అమర్చిన మల్టీపారామానిటర్ కేర్ ఎట్ హౌమ్ కాల్ సెంటర్కు ఇండికేషన్స్ ఇస్తుంది. వెంటనే వైద్యులు అప్రమత్తమై అవసరమైన వైద్యసేవలు అందిస్తారు.
Authorization