బరువు తగ్గాలంటే డైటింగ్ చేయాలి.. అదీ కాదంటే వాకింగ్ చేయడం, జిమ్కెళ్లడం.. ఇలా ఎక్సర్సైజ్లు చేస్తుంటారు. కానీ డైటింగ్ చేయకుండా, ఎక్సర్సైజ్ జోలికి వెళ్లకుండా బరువు తగ్గాలని అనుకునే వారు కొన్ని టిప్స్ పాటిస్తే చాలు అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఆ టిప్స్ ఎంతో మనం ఫాలో అవుద్దామా..!
ప్రొటీన్లు ఎక్కువగా : ఆహారంలో ప్రొటీన్లు ఎక్కు వగా ఉండటం వల్ల త్వరగా పొట్ట నిండుతుంది. ఆకలి తగ్గడం వల్ల శరీరంలోకి తక్కువ కెలరీలు చేరతాయి. ఘెర్లిన్, జీఎల్పీ-1 లాంటి హార్మోన్లపై ప్రొటీన్లు ప్రభావం చూపుతాయి. ఇవి ఆకలి పెంచ డంలో, కడుపు నిండిన భావన కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చికెన్ బ్రెస్ట్, చేపలు, గ్రీక్ యోగర్ట్, లెంటిల్స్, క్వినోవా, ఆల్మండ్స్ లాంటి ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
పీచు పదార్థాలు ఎక్కువగా : పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చాలా సేపటి వరకు ఆకలి కాదు. విస్కోస్ ఫైబర్ అనే పీచుపదార్థం బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. విస్కోస్ ఫైబర్ మొక్కల నుంచి లభించే ఆహారంలోనే ఉంటుంది. బీన్స్, ఓట్స్ సెరల్స్, బ్రస్సెల్స్ స్ప్రౌర్ట్స్, ఆస్పరాగస్, నారింజ, అవిసె గింజల్లో ఈ పీచు పదార్థం ఉంటుంది.
తరచుగా నీరు తాగడం : మంచి నీటిని తరచుగా తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండుతుంది. భోజనానికి ముందు మంచినీళ్లు తాగని వారితో పోలిస్తే.. తాగేవారు త్వరగా బరువు తగ్గుతారు. 12 వారాలపాటు చేసిన అధ్యయనంలో తినడానికి ముందు నీరు తాగిన వారు 44 శాతం అధికంగా బరువు కోల్పోయినట్టు తేలింది.
కొద్దికొద్దిగా : మితంగా ఆహారం తినే వారితో పోలిస్తే ఎక్కువ మొత్తంలో లాగించే వారు త్వరగా బరువు పెరుగుతారు. కొంచెం కొంచెం వడ్డించుకొని తినడం వల్ల శరీరంలోకి తక్కువ కేలరీలు చేరతాయి.
తినేటప్పుడు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం లాంటి పనులు చేస్తే.. ఎంత తింటున్నామనే ఆలోచన ఉండదు. ఫలితంగా ఎక్కువ తినేస్తాం. పరధ్యానంగా తినడం వల్ల 25 శాతం ఎక్కువ కేలరీలు తీసుకుంటారు.
మెల్లగా తింటే : ఆహారం తీసుకునేటప్పుడు ఆదరాబాదరగా తినొద్దు. మెల్లగా నమిలి తినండి. ఇలా చేయడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
తగినంత నిద్ర : నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్ లాంటి హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఒత్తిడికి లోనైతే కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కు వగా విడుదలవుతోంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆకలి పెరుగుతుంది, అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. ఫలితంగా శరీరంలోకి ఎక్కువ కేలరీలు చేరతాయి. నిద్రలేమి, ఒత్తిడి వల్ల డయాబెటిస్, ఒబెసిటీ లాంటి అనేక వ్యాధులు చుట్టుముడతాయి.
Authorization