జబ్బు రాకుండా ప్రివెంట్ చెయ్యడం చాలా మంచి విషయం. ముఖ్యంగా డయాబెటీస్ హెరిడిటీగా ఉన్నవారు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. డయాబెటీస్ రాకుండా ఉండాలంటే లైఫ్‌స్టయిల్ ఒక క్రమంలో ఉండాలి. ఎప్పుడైతే గాడి తప్పుతుందో అప్పుడు లైఫ్ స్టయిల్ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. మీ జీవన శైలిని ఒకసారి పరీక్షించుకుని చూడండి. వెంటనే ఎక్కడ జాగ్రత్త పడాలో తెలుస్తుంది. దానికి తగిన చర్యలు చేపట్టి, అవసరమైతే డాక్టర్‌ను కలిసి సరైన డైట్, లైఫ్‌స్టైల్ అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. డయాబెటీస్ రాకుండా నివారించవచ్చు. ఆహారంలో పీచు పదార్థం బాగా ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా త ణధాన్యాల నుంచి వచ్చే ఫైబర్ షుగర్ లెవల్స్‌ని నార్మల్‌గా ఉండేట్టు చేస్తుంది. త ణధాన్యాలు అంటే త ణధాన్యాల పిండి, బ్రౌన్ రైస్, అన్ని రకాల మిల్లెట్స్. ఒక త ణధాన్యాల పిండి, ఏదైనా ఒక కూరగాయ, ఒక పండు మీ ఆహారంలో తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలి. ఆహారం సమతుల్యంగా ప్లాన్ చేసుకుని తీసుకోవాలి. టైమ్ ప్రకారం ఆహారం తీసుకోవడం ముఖ్యం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. కనీసం పదినిమిషాల పాటు వాకింగ్ అయినా చేయాలి. కొంచెం హార్ట్‌బీట్ రేట్ పెరిగేట్టు వాకింగ్ చేస్తే మెటబాలిక్ యాక్టివిటీ సక్రమంగా ఉంటుంది.సమయానికి నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లేట్‌నైట్ వల్ల మెటబాలిక్ యాక్టివిటీలో మార్పులు వచ్చి డయాబెటిక్కు దారితీస్తాయి. క్రానిక్ ఒత్తిడి వల్ల ఆరోగ్యం చెడుతుంది. ఒత్తిడిని అధిగమించడానికి ఎవరికి వారే ఒక సూత్రం కనిపెట్టుకోవాలి. యోగా, పెంపుడు జంతువులతో ఆడుకోవడం, మొక్కలు పెంచడం, పుస్తకాలు చదవడం, చక్కటి సువాసనలతో వేడి నీళ్ల స్నానం చెయ్యడం మొదలైనవి.