ప్రతిరోజూ మనం తీసుకునే పౌష్టికాహారంలో పాలు ఎంతో ముఖ్యమైనవి. పాలలో దాదాపుగా అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. ఇది ఒక బ్యాలెన్స్డ్ డైట్ లాంటిది. ఐరన్, విటమిన్ సి తప్ప మిగిలిన అన్ని పోషకాలుంటాయి. సో.. పాలు తాగడం వల్ల చాలా పోషకాలు మనకు అందుతాయి. పాలలో ఉండే పోషకాలు హై బయోలాజికల్ వాల్యూ కలిగి ఉంటాయి. అంటే పాలలో ఉన్న అన్ని పోషకాలు వంద శాతం మనకు లభ్యమవుతాయి. ప్రొటీన్, కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్, కాల్షియం, బి విటమిన్, ఫ్యాట్ సోల్యుబుల్ విటమిన్స్ మొదలైనవి పాలలో ఉంటాయి. పెరిగే పిల్లలు పాలు తాగడం వల్ల ఎముకలు పొడువుగా, మందంగా పెరిగి గట్టిపడతాయి. ఆర్యోగంగా పెరుగుతారు. - గర్భవతులు పాలు తాగడం వల్ల పిండం వృద్ధి బాగుంటుంది. - పాలిచ్చే తల్లులు పాలు తాగడం వల్ల వారి ఎముకల నుంచి పోయిన కాల్షియం తిరిగి చేరుతుంది. - నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. బి12, విటిమిన్ డి లోపాలు రాకుండా చేస్తుంది. - మెనోపాజ్, ఆండ్రోపాజ్ దశలో పాలు తాగితేశరీరానికి కావల్సిన క్యాల్షియం అందుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. - చాలామందికి పాలుపడవు. ఆ వాసన చూస్తేనే వాంతులు చేసుకుంటారు. అలాంటివారు పాలకు బదులు పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు. పనీర్ చీజ్, పెరుగు, మజ్జిగ ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. - ఫ్యాట్ పర్సెంట్ ఎంత ఉండాలి అన్నది తరచు ఎక్కువ మందిని వేధించే ప్రశ్న. పాలు వీలైనంత నార్మల్‌గా తీసుకోవాలి. అంటే ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలన్నమాట. ఇలా తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, డి, ఈ,కెలు అందుతాయి. - పాలలో ఏమీ కలపకుండా నార్మల్‌గా తీసుకుంటే మంచిది. పసుపు, మిరియాలు, పంచదార, ఇతర సప్లిమెంట్స్ అవసరాన్ని బట్టి మాత్రమే వాడాలి. - అధిక బరువు ఉన్నవారు పాలు తాగవద్దు అంటారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే..బరువు తగ్గాలనుకున్నవారు పాలు మానాల్సిన అవసరం లేదు. నిజానికి పాలతో వివిధ రకాల మిల్క్‌షేక్స్ చేసుకుని, భోజనానికి బదులుగా తీసుకోవచ్చు. ఎటువంటి పోషకలోపం రాకుండా డైట్ చేయవచ్చు. పాలు జీర్ణమవడానికి సమయం పడుతుంది. దాంతో ఆకలి కూడా తగ్గుతుంది.