చూడగానే తినాలనిపించే రంగులో పండేమోననిపించేలా ఉంటుంది రెడ్ క్యాప్సికం. రంగులోనే కాదు పోషకాలల్లోనూ ఆకట్టు ్టకుంటుంది. ఎర్ర క్యాప్సికంలో 30 రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయని ఆహారనిపుణు లు అంటున్నారు. వీటిల్లో అధికంగా ఉండే లైకోపేన్ ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ల వంటివి దరిజేరకుండా చూస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికీ ఇదెంతో మేలు చేస్తుంది. దీనిలోని విటమిన్ సి రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికే కాదు, శరీరం ఐరన్‌ను గ్రహించుకోవటానికి తోడ్పడుతుంది మరి. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్ బి6 కడుపుబ్బరం తగ్గటానికీ దోహదం చేస్తుంది. విటమిన్ ఎ ఎక్కువగా ఉండటంతో మెరుగైన కంటి చూపును ఇస్తుంది. ఇది మిరపకాయలు, మిరియాల మాదిరిగా కారంతో మంట పుట్టించ కుండానే మన జీవక్రియల వేగం పుంజుకునేలా చేస్తుంది.