మన శరీరంలోని ప్రతికణానికి ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. అయితే శరీరం మొత్తంలో రక్తం ఉండని ఒకే ఒక అవయవం మన కంట్లోని కార్నియా! ఇది గాల్లో కలిసిన ఆక్సిజన్‌ను నేరుగా స్వీకరిస్తూ ఉంటుంది. కంట్లోని కండరాలు కంటికి సంబంధించినంతవరకూ మిగతా శరీరంలోని అవయవాలన్నింటి కంటే దృఢమైనవి.మన కన్ను500 రకాల నలుపు రంగుల్ని గుర్తించగలదు. 10 మిలియన్ల వేర్వేరు రంగుల్ని కనిపెట్టగలదు.పసికందులకు 3 నెలలొచ్చేవరకూ ఎంత ఏడ్చినా కన్నీళ్లు కారవు.పరిస్థితులు అనుకూలంగా ఉంటే మన కండ్లు 14 మైళ్ల దూరంలో ఉన్న క్యాండిల్ వెలుగును కూడా గుర్తించగలవు.