మెంతుల్లో ఫైబర్, ప్రొటీన్లు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. మెంతులు ఎక్కువగా తినడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణసంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. మన వంటింట్లో ఉండే వీటిని రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను తప్పించుకోవచ్చు. మెంతులు శరీరంలోని కార్బోహైడ్రేట్ల నిల్వలను అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ సమస్య ఉన్నవారికి మెంతులు మంచి ఆహారం. జీర్ణాశయంలోని కొలెస్ట్రాల్‌ను గ్రహించేలా చేస్తాయి. కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తిని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ట్రైగ్లాసరాయిడ్స్ను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. మెంతుల్లో పీచు అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా మెంతుల్ని తినడం వల్ల గుండె సంబంధమైన వ్యాధులు వచ్చే ముప్పు తగ్గిపోతుంది. రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యల్ని నియంత్రిస్తాయి. మెంతుల్లో అధికంగా ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయి. గింజలే కాదు మెంతికూర కూడా ఎంతో మంచిది. మెంతి కూర తినడం వల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.