నడుస్తున్నప్పుడో, మెట్లు ఎక్కుతున్నప్పుడో ఎప్పుడైనా కీళ్లల్లో కాస్త నొప్పి అనిపిస్తే అది మామూలే అనుకుంటాం. అయితే తరుచుగా అలా నొప్పి అనిపిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేసేవాళ్ళు ముందుగా తొడ, పిక్క కండరాలు గ ట్టిపడే వ్యాయామాలు చేయాలి. కాలు, పిక్క కండరాలు గట్టిపడే స్క్వాట్, బ్రిడ్జెస్, హిప్ స్టెబిలిటీ వ్యాయామాల్ని రోజూ క్రమం తప్పకుండా చేయాలి. రన్నింగ్, జాగింగ్ చేయడానికి ముందు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు ఈ తేలికపాటి వ్యాయామాలు చేసిన తర్వాతే రన్నింగ్ గానీ, జాగింగ్ గానీ చేయాలి. మోకాళ్లు నొప్పులతో బాధపడేవారు సరాసరిగా రన్నింగ్లు, జాగింగ్లు చేస్తే మోకాలు కీళ్లు మరింత దెబ్బ తినే ప్రమాదం ఉంది. వాకింగ్, రన్నింగ్ చేసే సమయంలో మోకాలు నొప్పి అనిపిస్తే కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఐస్ గడ్డను గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న భాగాల్లో ఉంచి అటూ ఇటూ తిప్పాలి. నొప్పి తగ్గగానే మళ్లీ వ్యాయామం చేయాలి. కొద్ది రోజుల తర్వాత నొప్పి మళ్లీ వస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫిజియో థెరపిస్టును, ఆర్థోపెడిక్ డాక్టర్ను సంప్రదించాలి. మోకాళ్లకీళ్లలో ఏదైన సమస్య ఉంటే చికిత్స తీసుకోవాలి.