ఈ పేస్ట్ వాడితే మీ దంతాలు మెరుస్తాయి, ఈ పేస్ట్ వాడితే తాజాదనం అంటూ టీవీ యాడ్స్ లోనో, సినిమాల్లోనో తెల్లగా మెరిసే దంతాలు కనిపిస్తుంటాయి. కానీ ఏ పేస్ట్ వాడినా చాలా మంది దంతాలు లేత పసుపు రంగులో కనిపిస్తుంటాయి. ఈ సమస్యలకు కారణాలు తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దంతాల సమస్యల నుంచి బయటపడొచ్చు.
- మన దంతాలు పచ్చబడడానికి చాలా రకాల కారణాలున్నాయి. తినే ఆహారం దగ్గరి నుంచి ఆరోగ్య పరిస్థితి వరకు ఎన్నో అంశాలు దంతాలపై ప్రభావం చూపుతాయి. ఎనామిల్ మందంగా ఉంటే దంతాలు తెల్లగా కనిపిస్తాయి. సన్నగా ఉంటే పసుపు రంగులో కనిపిస్తాయి. మనలో వయసు పెరిగిన కొద్దీ ఎనామిల్ మందం తగ్గిపోతుంటుంది. దాంతో దంతాలు పసుపురంగులో కనిపిస్తుంటాయి. దీనికితోడు శుభ్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఎనామిల్ పొరపై మరకలు పడతాయి. దంతాల్లో ఎనామిల్ పొర, డెంటిన్ పొర, మెత్తటి కణజాలం అని మూడు భాగాలు ఉంటాయి. అన్నింటికన్నా పైన ఉండేది ఎనామిల్ పొర. ఇది పాక్షికంగా పారదర్శకంగా, తెలుపు రంగులో ఉంటుంది. దంతాలకు అత్యంత ద ఢత్వాన్ని ఇచ్చేది ఇదే. ఇది ఎంత గట్టిగా ఉంటుందంటే అదే పరిమాణమున్న ఉక్కు కంటే ఎనామిల్ ఎక్కువ దృ ఢంగా ఉంటుంది. ఎనామిల్ పొర కింద డెంటిన్ పొర ఉంటుంది. డెంటిన్ అంటే ఎముకల వంటి కణజాలం. ఇది కూడా దృఢంగా ఉంటుంది. లేత పసుపు రంగులో ఉంటుంది.
- మనం తినే ఆహారం నోటి మూలల్లో, దంతాల మధ్య ఉండిపోయినప్పుడు దానిపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్లాక్ గా మారి.. దాని నుంచి కొన్ని రకాల యాసిడ్ (ఆమ్లాలు) లు వెలువడతాయి. ఈ యాసిడ్ల కారణంగా దంతాలకు రక్షణగా ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని, రంధ్రాలు ఏర్పడతాయి. వాటినే కావిటీలు లేదా పిప్పిపళ్లు అంటారు. ఈ కావిటీలను నిర్లక్ష్యం చేస్తే.. చివరికి దంతాలు పూర్తిగా దెబ్బతిని, రాలిపోవడానికి కారణ మవుతాయి.క్యావిటీలు ఎనామిల్ పొరతోపాటు డెంటిన్ పొరకు కూడా విస్తరిస్తే.. దంతాల పరిస్థితి బాగా దెబ్బ తిన్నట్లే లెక్క.
- ముఖ్యంగా యాసిడిక్, ముదురు రంగు ఆహార పదార్థాలు, ద్రాక్ష, నేరేడు, దానిమ్మ వంటి పండ్లు, రెడ్ వైన్, శీతల పానీయాలు, పొగాకు ఉత్పత్తులు వంటి వాటితో దంతాలు ఎక్కువగా పసుపు రంగులోకి మారుతాయి.
- కాఫీ, టీ, వైన్ లాంటి వాటిలో ఉండే టానిన్లు అనే రసాయనాల వల్ల కూడా ఎనామిల్ పై మరకలు ఏర్పడతాయి. చిగుళ్లవ్యాధికి, మొటిమల నివారణకు, రక్తపోటును నియంత్రణకు వాడే మందుల వల్ల కూడా దంతాలు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంటుంది.
- తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడం వల్ల దంతాలు పూర్తిగా పచ్చబడతాయి.
Authorization