మారిన జీవనశైలితో వ్యాయామం విధానాలు కూడా మారుతున్నాయి. కొత్త వ్యాయామ పద్ధతులు, ప్రయోగాత్మక పద్ధతులకు ఆదరణ పెరుగుతోంది. ఈ కోవలో అందుబాటులోకొచ్చిన కొత్త పద్ధతి.. ఆక్వా ఫిట్నెస్. దేశమంతటా విస్తరిస్తున్న ఈ వ్యాయామం ప్రత్యేకత రోజూ చేసే వ్యాయామాలన్నీ నీటిలో చేయడమే. గాయాలవుతాయనే భయం ఉండ దు. కీళ్ల నొప్పులు సమస్యే కాదు. నీటిలో దిగితే చాలు శరీరం బరువును కోల్పోతుంది. 90 శాతం బరువు నీటిలోకి బదిలీ అవుతుంది. దాంతో తేలికగా ఉన్న భావన కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ వ్యాయామం చేయాల్సిన అవసరం లేకుండానే కండరాలు బలపడతాయి. శరీరానికంతటికీ వ్యాయామం జరిగి, తీరైన ఆక తిని పొందుతుంది. జిమ్లో చేసే వ్యాయామాలతో పోల్చితే శరీరం 13 రె ట్లు అధికంగా బరువు తగ్గుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.