ఎండాకాలంలో విరివిగా దొరికే చెరకు రసంతో దాహం తీరడమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయట. చెరుకుతో చెప్పలేనన్ని లాభాలు ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. శక్తినిచ్చే ఈ పానీయానికి ఆరోగ్యానికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయట. ముఖ్యంగా చెరకు రసంలో సుక్రోజ్ రూపంలో ఉండే చక్కెరను శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. అందుకే చెరకు రసం తాగగానే తక్షణం ఎనర్జీ చేకూరుతుంది. డీ హైడ్రేషన్ బారినప్పుడు చెరకు రసం తాగితే త్వరగా కోలుకుంటారు. ఇందులోని ఫినాల్, ఫ్లేవనాల్, ఒంట్లోని ఫ్రీ ర్యాడికల్స్ ను పారద్రోలి కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా నియంత్రించే ప్లేవనాయిడ్స్ చెరకు రసంలో ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల క్యాన్సర్ కణాలు విస్తరించకుండా చేయడంతో పాటు వాటితో పోరాడి నాశనం చేస్తాయి. చెరకు రసం స్పోర్ట్స్ డ్రింక్ గా కూడా ఉపయోగపడుతుందట. ఆటల వల్ల వచ్చే అలసటను దూరం చేసే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ కాల్షియం ఎలక్ట్రొలైట్లు చెరకు రసంలో ఎక్కువగా ఉంటాయి. ఇందులో గైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి మధుమేహంతో బాధపడేవారు కూడా చెరకు రసం తాగవచ్చని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. సో.. ఎండల నుంచి రక్షణ కోసం చెరుకు రసం తాగడం ఎంతో మంచిది.