- ఎండా కాలంలో చలువ నిచ్చే రాగులలో ఎముకల బలహీనతను అరికట్టే పోషకాలెన్నో ఉన్నాయి. ఎముకల పుష్టి కోసం క్యాల్షియం మాత్రలకు బదులుగా రోజూ రాగి జావ తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. - పిల్లల ఎముకలు బలంగా వుండాలన్నా, వారు ఆరోగ్యంగా పెరగాలన్నా వారికి ప్రతిరోజూ రాగి జావ ఇవ్వాలి. - రాగుల్లో తక్కువగా ఫ్యాట్స్ ఉంటాయి. అధిక బరువుతో ఇబ్బంది పడేవాళ్లు రాగిజావ తాగితే బరువు తగ్గుతారు. - గోధుమలు, అన్నం కాకుండా రాగులు ఎక్కువగా తీసుకుంటుంటే హైబిపీ, షుగర్, అధిక బరువు సమస్యలు నివారించవచ్చు. - రాగుల్లో ఎక్కువగా అమినో ఆసిడ్లు, పాలి ఫెనాల్, ఫైబర్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను ఇది క్రమబద్ధీకరిస్తుంది. గ్లూకోజ్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి ఇది మంచి మందుగా కూడా పనిచేస్తుంది. - సహజసిద్ధంగా కావల్సినంత ఇనుము ఇందులో లభ్యమవుతుంది. రక్తహీనతతో బాధపడేవారు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకునేందుకు రాగులను తీసుకుంటుంటే మంచి ఫలితం వుంటుంది. విటమిన్ సి స్థాయిలను కూడా ఇది పెంచుతుంది.