చాలామందిలో నీరసం, అలసట కనిపిస్తుంటాయి. వీరిలో నిద్రలేమి సమస్య ఉండదు. ఆకలి బాగానే ఉంటుంది. రోజూ వ్యాయామం చేస్తుంటారు. అయినా నీరసం, అలసట వెంటాడు తుంటాయి. అయితే అదేపనిగా అలసటగా వేధిస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా రక్తంలో హిమోగ్లోబిన్ మోతాదు తెలుసుకునేలా రక్తపరీక్ష చేయించుకోవాలి. కొన్నిసార్లు హిమోగ్లోబిన్ లోపించినా అలసటగా అనిపిస్తుంది. శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్ లోపంతో నీరసంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ తగ్గితే భయపడాల్సిన అవసరం లేదు. ఐరన్ ఎక్కువగా ఉండేే పాలకూర, పుంటికూర, బచ్చలి వంటి ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలి. ద్రాక్ష , ఖర్జురాలతో పాటు పల్లీలు ఎక్కువగా తినాలి. డైట్లో ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను చేర్చుకుంటే నెలరోజుల్లోనే అలసట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.