మనం ఇల్లు సర్దినప్పుడు ఎన్నెన్ని వస్తువులు బయటపడుతుంటాయో! వాటిలో కొన్ని ఒకసారి కొంత వాడిన తరువాత మళ్లీ దాని అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. తలుపులకు రంగులు వేయగా సగం, సగం మిగిలిపోయిన రంగుల డబ్బాలుంటాయి. పెరటి మొక్కలకు చల్లగా మిగిలిన క్రిమిసంహార మందుల డబ్బాలుంటాయి. ఇలాగే ఇక మన ఇంటికి వీటి అవసరం లేదనిపించే ఎన్నో వస్తువులు బయటపడుతుంటాయి. వాటిని పారవేయడానికి మనసురాదు. అందుకే నెలలో ఓ రోజు కాలనీలో ఉన్న ఇండ్ల వాళ్లంతా అన్ని ఇండ్లలోని మిగిలిన వస్తువులను ఒకచోట పెట్టి ఎవరికి అవసరమైన వాటిని వారు తీసుకుంటే ఎలా ఉంటుంది? డబ్బు వృథా తగ్గుతుంది. వీటి తయారీకి తిరిగి వినియోగించుకోవాల్సిన సహజవనరుల ఖర్చు తగ్గుతుంది. భూమాతను చల్లగా ఉంచుకోవడానికి ఇలాంటివే ఎన్నో ఉంటాయి. మొదటగా పుస్తకాలు, దుస్తులను అనాథశరణాలయానికి తీసుకెళ్లి పంపిణీ చేస్తే ఎలా ఉంటుంది?