భానుడి ప్రతాపం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఎండలు మండి పోతున్నాయి. ఈ వేడి నుంచి ఉపశమనం ఇచ్చేలా చల్లని పానీయాలు, రకరకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో తాటిముంజలది అగ్రస్థానం. ప్రక తి సిద్ధమైన నీరు..పోషకాలు కలగలిపిన లేలేత గుజ్జుతో అందరికీ నోరూరించే వీటిని ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. దాహార్తిని తీర్చే తాటి ముంజల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. తాటిముంజలు లేత కొబ్బరిలా ఉంటాయి. ప్రతి ఒక్కరు వీటిని తినడానికి ఇష్టపడతారు. తాటిముంజలో తక్కువ కేలరీలు ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన శక్తి ఉంటుంది. ఎండాకాలంలో సీజనల్గా వచ్చే వీటిని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఎండాకాలంలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇది సమతుల్యం చేస్తోంది.
అధికమొత్తంలో ఉండే విటమిన్లు, ఐరన్, క్యాల్షియం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
గర్భిణీలకు ఏది తిన్న జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంటుంది. ముంజలు తినడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. వీటితో జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేయడమే కాకుండా మలబద్దకం, అసిడిటీ లాంటి అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.
తాటిముంజలలో శరీరానికి కావాల్సిన ఏ, బీ, సీ, విటమిన్లు, ఐరన్ జింకు, పాస్పరస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాక వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండడంతో శరీర బరువును తగ్గించడంలో ఎంతోగానో తోడ్పాడుతాయి.
వీటిలో అధిక మొత్తంలో ఉండే పొటాషియం, శరీరంలో ఉండే విషపదార్థాలను నశింపజేయడానికి సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగుదలకు దోహదంపడటం వల్ల శరీరంలో విషపదార్థాలు నిల్వ ఉండకుండా చేస్తుంది. తాటిముంజలతో కాలేయ సంబంధ సమస్యలు తగ్గుతాయి.
అధికవేడికి కొంతమందికి వాంతులవుతాయి. డిహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. తాటిముంజలు తినడం ద్వారా వాంతుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ట్యూమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, కణాలను అభివ ద్ధి చేసే పైటోకెమికల్స్, ఆంథోసైనిన్ లాంటి వాటిని నిర్మూలించడానికి తాటిముంజలు ఉపకరిస్తాయి. వీటిని తినడం ద్వారా క్యాన్సర్కు దూరం కావడమే కాకుండా శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావాల్సిన మినరల్స్ న్యూట్రిన్ శాతాన్ని సమతూకం చేయడంలో తాటిముంజలు కీలకపాత్ర పోషిస్తాయి.
చాలామంది ముంజలపై పొట్టులా ఉండే పొరను తీసి తింటారు. కాని ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ పొట్టుతోనే శరీరానికి ఎక్కువ చలవ చేస్తుంది.
ఎండాకాలంలో ముఖం మీద వచ్చే చిన్న చిన్న మెటిమలకు వీటి ద్వారా ఉపశమనం పొందవచ్చు.
Authorization