వణికిస్తున్న వైరల్ జ్వరాలతో రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. వయసుతో, ఆర్థికస్థాయితో, పల్లెపట్టణం తేడా లేకుండా జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం రావడానికి కారణాలు ఏమైనా.. ఎలాంటి జ్వరమైన త్వరగా తగ్గాలన్న ఆలోచనతో విపరీతంగా మందులు వాడుతున్నారు. అనారోగ్యానికి తోడూ ఆర్థికభారం తప్పడం లేదు. జ్వరానికి మందులను ఎక్కువగా వాడటం వల్ల వచ్చే ఇబ్బందులను గమనించాలి. మందులు వాడేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు , వాటి దుష్పరిణామాల గురించి అవగాహన చాలా అవసరం. అనేక రకాల అనారోగ్య సమస్యల కోసం చాలా రకాల మందులు వాడుతున్న అందులో తరచుగా వాడే కొన్ని మందుల గురించి తెలుసుకుందాం.
పారాసెటమాల్
పారాసెటమాల్ (అసిటమినోఫెన్) అనేది నొప్పి నివారణకు వాడే ఒక రకమైన నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ . దీనిని జ్వరానికి, కండరాల నొప్పులకు, తల నొప్పికి, ఒంటి నొప్పులకు, కీళ్ల నొప్పులకు కూడా వాడతారు. కనుక చాలావరకు నొప్పి ఉన్న రుగ్మతలకు వైద్యులు దీనిని సిఫార్సు చేస్తారు.
ఎలా పని చేస్తుంది
పారాసెటమాల్ ఒక నాన్-స్టెరాయిడల్ యాంటి ఇంఫ్లమేటరీ డ్రగ్ . పారాసెటమాల్
సాధారణంగా ఫీవర్ ఉన్నప్పుడు మన మెదడు లోని హైపోథాలమస్ లో ఉండే,జఉశ-3 అనే ఎంజైమ్ పై పని చేసి శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది.
పారాసెటమాల్ నొప్పిని, వాపును కలిగించే కొన్ని రకాల రసాయనాలను మెదడులో విడుదల కాకుండా అడ్డుకొని నొప్పి లేకుండా చేస్తుంది.
ఈ ట్యాబ్లెట్ ని జ్వరంతో పాటు మరికొన్ని వ్యాధులు చికిత్సకు, నివారణకు ఉపయోగిస్తారు.
జ్వరం, తల నొప్పి, మైగ్రెయిన్, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, చెవిలో నొప్పి, ఆర్థరైటిస్ నొప్పులు, దంతాల నొప్పి, కండరాల నొప్పులు, నెలసరి సమయంలో ఉండే నొప్పులు.
పారసెటమాల్ సైడ్ ఎఫెక్ట్స్
కాలేయానికి హాని, చర్మంపై ఎర్రని దద్దుర్లు, అలెర్జీ, శ్వాస ఆడకపోవుట, రక్త కణాలు తగ్గిపోవడం, చర్మంపై బొబ్బలు, ముఖ వాపు మొదలైన సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి.
జాగ్రత్తలు:
పారసెటమాల్ ను సిఫార్సు చేయబడిన మోతాదు కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు. అలా మోతాదుకు మించి వాడడం తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.
పెద్దవారికి సిఫార్సు చేయబడిన గరిష్ట మోతాదు ఒకసారికి 650 మి.గ్రా మోతాదులో రోజుకు 2600 మి.గ్రా. మాత్రమే వేసుకోవాలి. ఈ మోతాదు కన్నా ఎక్కువ వేసుకుంటే కాలేయానికి హాని కలిగించవచ్చు.
మద్యపానం అలవాటు ఉన్నవారు పారసెటమాల్ ను వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
పిల్లలకు అయితే పెడియాట్రిక్స్ తరహా పారసెటమాల్ మందులనే వాడాలి. జాగ్రత్తగా మందుల ప్యాకెట్ మీద సూచించిన మోతాదు ఆదేశాలు తెలుసుకోవాలి.
రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలకు వైద్యుల సలహ లేకుండా వాడకూడదు.
ఐబుప్రోఫెన్
ఐబుప్రోఫెన్ ఒక నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్. జ్వరాన్ని తగ్గించడానికి మరియు ఆర్థరైటిస్, తలనొప్పి, పంటి నొప్పి, వెన్ను నొప్పి, స్త్రీలలో ఋతు సమయంలో కలిగే నొప్పి నివారణ లేదా చిన్నపాటి గాయాల వల్ల కలిగే పలు రకాల నొప్పులను లేదా వాపును తగ్గించడానికి ఐబుప్రోఫెన్ ఉపయోగపడుతుంది. ఈ మెడిసిన్ పెద్దలకు, కనీసం ఆరు నెలల వయస్సు పైబడ్డ పిల్లలకు మాత్రమే వాడాలి.
ఎలా పని చేస్తుంది
ఇది సైక్లో అక్సిజినేజ్ అనబడే ఎంజైమ్ ను అదుపు చేస్తుంది. శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, గాయం అయినపుడు, ఈ ఎంజైమ్ ప్రోస్టాగ్లాన్డిన్స్ విడుదల చేస్తుంది. నొప్పి, వాపు కలగడానికి రసాయనాలే కారణం. కనుక ఐబుప్రోఫెన్ మెడిసిన్, సైక్లో అక్సిజినేజ్ అనే ఎంజైమ్ ను అదుపు చేయడం వల్ల ప్రోస్టాగ్లాన్డిన్స్ రసాయనాలు తక్కువ విడుదల అవుతాయి, తద్వారా నొప్పి, వాపు తగ్గుతాయి.
జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి నియంత్రణకు సిఫార్సు చేస్తారు .
ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్లనొప్పి, తొంటినొప్పి(హిప్ పెయిన్), మెడనొప్పి, వెన్నునొప్పి వంటి నొప్పులను తగ్గించడానికి ఈ మందును డాక్టర్లు సూచిస్తారు
రుమటాయిడ్ ఆర్థర్కెటిస్ వల్ల కలిగే కీళ్లనొప్పులను, వాపులను తగ్గించడానికి వాడతారు
మహిళల్లో నెలసరి బాధలను తగ్గించడానికి సిఫార్సు చేస్తారు
జాగ్రత్తలు..
ఐబుప్రోఫెన్ , ఇతర నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ రకానికి చెందిన ఏ ఇతర మందులైన పడని వారు, అలెర్జీ ఉన్నవారు వీటిని వాడ కూడదు. ముందుగా టెస్ట్డోస్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే వాడమని డాక్టర్లు సూచిస్తారు.
ఆస్తమా, ఊపిరి తిత్తులకు సంభందించిన ఏ ఇతర సమస్యలతో బాధపడేవారు వీటిని వాడవద్దు.
శరీరంలో ఏదైన రక్తస్రావం జరుగుతుంటే కూడా ఈ మెడిసిన్ సిఫార్సు చేయరు. ఇలాంటపుడు ఇది వాడడం వల్ల శరీరంలో అంతర్గతంగా ఉదాహరణకు ప్రేగులలో రక్తస్రావం ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సైడ్ ఎఫెక్ట్స్ ..
అతిగా వాడితే ఏదైనా ప్రమాదకరమే. ఐబుప్రోఫెన్ ను ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే అనేక సమస్యలు వస్తాయి.
పొత్తికడుపులో నొప్పి, చర్మంపై దద్దుర్లు,
చెవిలో శబ్దాలు వినపడడం, తలనొప్పి, మైకము, మగతగా ఉండడం, నీళ్ల విరేచనాలు, వికారం , గుండెల్లో మంట, మలబద్దకం వంటి సమస్యలు ఐబుప్రోఫెన్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సైడ్ఎఫెక్ట్స్.
ప్రేగులలో అల్సర్, కొన్ని సార్లు రక్తస్రావం కూడా ఉండడం వంటి కొన్ని తీవ్ర దుష్ప్రభావాలు అలర్జీ కలగడం, ముఖ్యంగా ఆస్థమా ఉన్నవారిలో ఎక్కువ అవకాశం ఉంటుంది
కిడ్నిలకు రక్తప్రసరణ తగ్గడం, కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం కొద్దికాలం పాటు మాత్రమే వాడినపుడు ఈ మెడిసిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది
ఎక్కువ మోతాదులో వాడడం, లేదా ఎక్కువ కాలంపాటు వాడడం వల్ల కిడ్నిలకు హానికరం అవుతుంది ఇంకా జీర్ణాశయంలో రక్తస్రావం కావచ్చు .
కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ మెడిసిన్ ను తీసుకోకూడదు.
మద్యపానం చేసినపుడు ఈ ఐబుప్రోఫెన్ మెడిసిన్ ను తీసుకోకూడదు.
గర్భిణి స్త్రీలకు ఐబుప్రోఫెన్ మెడిసిన్ సిఫార్సు చేయకూడదు. వీరు ఈ మందు వాడడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. గర్భంలోని శిశువుకు అయితే హాని కలుగవచ్చు, 6 నెలలు నిండిన గర్భిణి స్త్రీలు వాడటం వలన గర్భంలోని శిశువుకు ఫీటల్ డక్టస్ ఆర్టీరియోసస్ మూసుకు పోవును , మూత్ర పిండాలు చెడి పోవటం ,రక్త స్రావం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
ఎసెక్లోఫెనాక్
ఎసెక్లోఫెనాక్ నొప్పినివారణకు వాడే మరొక నాన్ స్టెరాయిడల్ యాంటి ఇన్ఫ్లమేటరీ ఔషధం .
ఇతర నొప్పినిరోధక ఔషధాల కంటే కొద్దిగా తక్కువ ఆసిడ్ ను ఉత్పత్తి చేసే మందుగా పరిగణించబడుతుంది.
ఎలా పని చేస్తుంది :
నొప్పి ఒక ప్రొస్టాగ్లాండిన్ హార్మోన్ ఏర్పడడం వల్ల సంభవిస్తుంది. ఈ హార్మోన్ నొప్పి తగ్గించే ప్రక్రియలో సహాయపడుతుంది.
జ్వరం, తలనొప్పి, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, పంటి నొప్పి, ఫైబ్రోమైయాల్జియా ( కండరాల నొప్పి) తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలు, పోర్ఫిరియా రోగంతో బాధ పడుతున్న వారు ఈ మందు వేసుకోవద్దు.
గాస్ట్రిక్ అల్సర్స్ తో బాధపడేవారు కూడా తీసుకోకూడదు.
- డా. ఆకుల సంజరు రెడ్డి,
ఫార్మకాలజిస్ట్,
మెంబర్, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ .
Authorization