నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి పోల్కంపల్లి గ్రామంలో ప్రగ్మా ఆస్పత్రి ఆధ్వర్యంలో ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరానికి విశేష స్పందన లభించింది. ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. అలాగే ఆర్థో పెడిక్, గైనకాలజీ, జనరల్ చికిత్సలు అనుభవజ్ఞులైన వైద్యులు చేశారు. ఈ సందర్భంగా 150 మందికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సదర్భంగా ఎంపీటీసీ మంగ రవీందర్ మాట్లాడుతూ.. గ్రామంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశం తో క్యాంప్ ఎర్పాటు చేయడం జరిగిందన్నారు. పేదలు ఎలాంటి వైద్య క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అండాలు, ఉప సర్పంచ్ కొమ్మిడి జంగారెడ్డి, వార్డు సభ్యులు బాలకిషన్, శోభ, మహేష్, స్వరూపలతో పాటు వైద్యులు కార్తీక్ రెడ్డి, చందన, జీఎం శ్రీనివాస్, ఇంచార్జ్ మహేష్, గ్రామ పెద్దలు, గామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.