- గ్లోబల్ సైబర్ సెక్యురిటీ ఇండెక్స్ లో 10వ స్థానంలో భారత్
- పెగాసస్ వంటి స్పైవేర్ విషయాల్లో కనీస అవగాహన ముఖ్యం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కలకలం సష్టిస్తున్న సాంకేతిక భద్రత అంశం నేపథ్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచప్రఖ్యాత అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్‌తో కలిసి నిర్వహిస్తున్న డిజిథాన్ సైబర్ సెక్యురిటీ ప్రోగ్రామ్ శిక్షణను ఈనెల 16 నుంచి ప్రారంభిస్తోంది. గ్లోబల్ సైబర్ సెక్యురిటీ ఇండెక్స్ లో భారత్ 10వ స్థానంలో నిలవడం, పెగాసస్ వంటి స్పైవేర్ ఇటీవల కలకలం సష్టించిన తరుణంలో ఇటీవలి కాలంలో సైబర్ సెక్యురిటీకి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో డిజిథాన్ సైబర్ సెక్యురిటీ శిక్షణను జాబ్ ఓరియంటెడ్ రూపంలో అందజేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇటు వ్యక్తిగత భద్రత మరియు పరిపాలన సంబంధమైన అంశాల్లో సైబర్ దాడులు జరిగి ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు మరియు వ్యక్తులు ప్రభావితం అయిన ఉదంతాలు పెద్ద ఎత్తున తెరమీదకు వస్తున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆన్ లైన్ వేదికగా జరిగే కార్యక్రమాలు, లావాదేవీల విషయంలో ఆన్లైన్ మోసగాళ్లు తమ కుట్రలకు తెరలేపుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో, భద్రతపరమైన సమస్యలు ఎదుర్కునేందుకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ (యూటీడీ)తో కలిసి సైబర్ సెక్యురిటీ ప్రొగ్రాం పేరుతో నెల రోజుల శిక్షణను టీటా డిజిథాన్ అందుబాటులోకి తెచ్చింది. సైబర్ దాడులను ఎదుర్కునే నైపుణ్యవంతులను తీర్చిదిద్దడం, పెగాసస్ వంటి స్పైవేర్ విషయాల్లో శిక్షణ అందించి మెరుగైన అవకాశాలున్న ఈ రంగంలోని ఉద్యోగాలను కైవసం చేసుకునే దిశగా నైపుణ్యవంతులను తీర్చిదిద్దడం కోసం డిజిథాన్ సైబర్ సెక్యురిటీ ప్రోగ్రాం శిక్షణ రూపొందించారు.
ఈ శిక్షణ కార్యక్రమం గురించి టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల వివరిస్తూ, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సైబర్ సెక్యురిటీ ఉద్యోగాలు అత్యవసరమైనవిగా మారాయని వెల్లడించారు. ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటున్న విద్యార్థులు మరియు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నత అవకాశాలు కైవసం చేసుకునేందుకు శిక్షణ పొందేందుకు ఇది సరైన సమయం. సైబర్ సెక్యురిటీ రంగంలో దక్కే అవకాశాలను సొంతం చేసుకోవాలని సూచించారు. సైబర్ సెక్యురిటీ రంగంలో ఉన్న అవకాశాల్లో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ ఐటీ ఆడిటర్, పెనేట్రేషన్ టీజర్, సెక్యురిటీ స్పెషలిస్ట్, సెక్యురిటీ ఇంజినీర్, సెక్యురిటీ అనలిస్ట్, థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, అప్లికేషన్ సెక్యురిటీ అనలిస్ట్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఆర్ హ్యాండ్లర్, థ్రెట్ హంటర్ ఉద్యోగాలు ఉన్నాయని వివరించారు. సైబర్ సెక్యురిటీ రంగంలో సమగ్రమైన పట్టున్న నిపుణులు ఈ సైబర్ రెడీ శిక్షణను పర్యవేక్షించనున్నారు. ఈ శిక్షణలో లైవ్ ప్రాజెక్టు సైతం ఉండనుంది. ఈ శిక్షణను దీర్ఘకాలం ప్రోగ్రామ్‌గా సైతం అందించనున్నారు. డిజిథాన్ సైబర్ రెడీ ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ఉన్న వారు bఱ్.శ్రీy/సఱస్త్రఱ్ష్ట్రశీఅబిaషaసవఎy ద్వారా నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 8712360354/ 6300368705/ 8123123434 నంబరులో సంప్రదించవచ్చు. శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఈ నెల 13 కాగా, 16 నుంచే శిక్షణ ప్రారంభం కానుంది.
Authorization