Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 21,22 తేదీల్లో ఆన్లైన్లో రాతపరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల హాల్టికెట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా మంగళవారం నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశముందని తెలిపారు.