Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దంపతుల మధ్య తరచూ గొడవలు
- హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో ఘటన
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
కుటుంబంలో తరచూ గొడవల నేప థ్యంలో భార్యను చంపి అనం తరం భర్త ఉరేసు కున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలో జరిగింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్న జనార్దన్ (40) కూలి పనులు చేసేవాడు. అతని భార్య ప్రేమలత (35) ప్రయివేటు ఉద్యోగి. 2004లో వీరికి వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు. జనార్దన్ మద్యానికి బానిస కావడంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. సోమవారం ప్రేమలత తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని తూంకుంటకు వెళ్లి రాత్రి తిరిగొచ్చారు.
అనంతరం భార్యాభర్త గొడవపడ్డారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న జనార్దన్ ప్రేమలతను రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం ఇంట్లోనే ఫ్యాన్‌కు అతను ఉరేసుకుని చనిపోయాడు. ఉదయాన్నే వారి కొడుకు గమనించి తన అమ్మమ్మ మంచు లక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. వారు ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.