Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద గల ఎన్ఎఫ్సీ బేకరిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగందని ప్రాథమిక సమాచారం.