Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పీసీసీ పదవి పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పీసీసీ కోసం పరిశీలకుడిని ఎందుకు పంపించడం లేదని అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ఒక్కరే అభిప్రాయ సేకరణ చేస్తారా అని అన్నారు. ఫోన్ చేస్తే మాణిక్యం అసలు లిప్ట్ చేయరని అన్నారు. కాంగ్రెస్లో తనను సాగనంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినా అదృష్టం బాగుండి కొనసాగుతున్నాడని ఎద్దేవా చేశారు. పీసీసీ పీఠాన్ని బయట నుంచి వచ్చిన వారికి ఇస్తామంటున్నారని, అది జరిగితే తమ ఆత్మగౌరవం దెబ్బతినదా అన్నారు. పీసీసీని పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ఇవ్వాలని కోరారు. దీనిపై సోనియా గాంధీకి తాను లెటర్ రాశానన్నారు.